Chahal-Dhanashree: భార్యతో విడాకుల రూమర్లు.. మద్యం మత్తులో చాహల్! వీడియో వైరల్

 సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా విడాకుల వార్తలు వినిపిస్తుంటాయి. అయితే ఈ మధ్యన క్రికెటర్ల వైవాహిక బంధాలు కూడా బీటలు వారుతున్నాయి. మహ్మద్ షమీ, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా తమ భార్యలతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా యుజువేంద్ర చాహల్ తన భార్యతో విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Chahal-Dhanashree: భార్యతో విడాకుల రూమర్లు.. మద్యం మత్తులో చాహల్! వీడియో వైరల్
Chahal, Dhanashree
Follow us
Basha Shek

|

Updated on: Jan 05, 2025 | 3:51 PM

టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ వైవాహిక బంధంపై గత కొద్దికాలంగా తరచూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పుకార్లకు బలం చేకురుస్తూ సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు ధనశ్రీ- చాహల్. అంతేకాదు యుజ్వేంద్ర తన భార్య ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించాడు. ధనశ్రీ కూడా యుజ్వేంద్రను అన్‌ఫాలో చేసింది. అయితే చాహల్ తో కలిసున్న ఫోటోలను మాత్రం తొలగించలేదు. అంతకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది. దీంతో అప్పుడే వీరి విడాకుల పుకార్లు ఊపందుకున్నాయి. మరి ఇప్పుడు ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో ఇప్పుడు నిజంగానే విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చాహల్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరలవుతోంది. ఇందులో మద్యం మత్తులో తూగుతోన్న చాహల్ ను ఒక వ్యక్తి పబ్ నుంచి బయటకు తీసుకొస్తున్నట్లు ఉంది. ఇక కారులో కూర్చొన్న తర్వాత ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీయకుండా చాహల్ తన ముఖానికి చేయి అడ్డు పెట్టుకోవడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన క్రికెట్ అభిమానులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ధైర్యంగా ఉండు యూజీ భాయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని తెలుస్తోంది. చాహల్- ధనశ్రీ విడాకుల వార్తల నేపథ్యంలో కొందరు త్రో బ్యాక్ వీడియోను వైరల్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ ది ప్రేమ వివాహం. ఇరు కుటుంబాల సమక్షంలో 2020 డిసెంబర్ 11న వీరి వివాహం జరిగింది. ఇప్పుడు ఈ నాలుగేళ్ల వైవాహిక బంధానికి చాహల్, ధనశ్రీలు వీడ్కోలు పలకనున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..

కాగా గతేడాది టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకున్నారు. మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా తన భార్య నుంచి విడిపోయాడు. అంతకు ముందు మహ్మద్ షమీ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నాడు.

భర్త చాహల్ తో ధనశ్రీ వర్మ..

 

భార్య ధనశ్రీతో చాహల్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..