Team India: ఇక వన్డే, టీ20 సమరం.. టీమిండియా తదుపరి సిరీస్ వివరాలు, పూర్తి షెడ్యూల్ ఇదిగో

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరిదైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది

Team India: ఇక వన్డే, టీ20 సమరం.. టీమిండియా తదుపరి సిరీస్ వివరాలు, పూర్తి షెడ్యూల్ ఇదిగో
Team India
Follow us
Basha Shek

|

Updated on: Jan 05, 2025 | 5:33 PM

5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా  3-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ను నిలబెట్టుకోవడంలో టీమిండియా ఘోరంగా  విఫలమైంది. జట్టు ఈ పేలవ ప్రదర్శనకు బ్యాటింగ్ విభాగమే ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. మొత్తం సిరీస్‌లో టీమిండియా పేసర్లు ఇచ్చిన ఫైట్‌ను బ్యాటింగ్ విభాగం ఇవ్వలేదు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను వరుసగా మూడోసారి గెలుచుకోవడంలో భారత జట్టు విఫలమైంది. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకున్న టీమిండియా తదుపరి ఏ సిరీస్‌తో ఆడనుందనే వివరాలు ఇలా ఉన్నాయి. ఓటమితో ఆస్ట్రేలియన్ టూర్‌ను ముగించిన టీమిండియా ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు భారత్‌కు రానుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తో పాటు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఉంటుంది. ముందుగా టీ20 సిరీస్ జరుగుతుండగా, సిరీస్‌లో మొదటి మ్యాచ్ జనవరి 22న జరగనుంది. ఈ సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఆతిథ్య భారత జట్టును ఇంకా ప్రకటించలేదు.

టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ జనవరి 22న కోల్‌కతాలో జరగనుంది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఫిబ్రవరి 2న ముంబైలో జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి వన్డే నాగ్‌పూర్‌లో, రెండో వన్డే కటక్‌లో, మూడో వన్డే అహ్మదాబాద్‌లో జరుగుతాయి. ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వన్డే పద్ధతిలో జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లకు ఈ సిరీస్ మంచి ప్రాక్టీస్‌గా మారనుంది.

టీ20 సిరీస్ షెడ్యూల్

  • తొలి టీ20: 22 జనవరి- కోల్‌కతా
  • రెండో టీ20: 25 జనవరి- చెన్నై
  • మూడో టీ20: 28 జనవరి- రాజ్‌కోట్
  • నాలుగో టీ20: 31 జనవరి- పూణె
  • ఐదో టీ20: 2 ఫిబ్రవరి- ముంబై

వన్ డే సిరీస్ షెడ్యూల్

  • మొదటి వన్డే: ఫిబ్రవరి 6-నాగ్‌పూర్
  • రెండో వన్డే: ఫిబ్రవరి 9- కటక్
  • మూడో వన్డే: 12 ఫిబ్రవరి- అహ్మదాబాద్

వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు:

జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్ , మార్క్ వుడ్.

ఇవి కూడా చదవండి

టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు:

జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడెన్ కోర్స్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్ , మార్క్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..