Mogalirekulu Sagar: ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది.. మొగలి రేకులు యాక్టర్‌కు అంత అన్యాయం జరిగిందా..!

సినిమాలతో పాటు సీరియల్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లు .. సీరియల్స్ వస్తున్నానంటే చాలు టీవీలకు అతుక్కు పోతారు. ఇప్పుడు పదుల సంఖ్యలో సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు సీరియల్స్ అంటే మూడు నాలుగు పేర్లు మాత్రమే గుర్తుకు వచ్చేవి.. కానీ ఇప్పుడు చాలా రకాల సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. వీటికి తోడు హిందీ సీరియల్స్ కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి.

Mogalirekulu Sagar: ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది.. మొగలి రేకులు యాక్టర్‌కు అంత అన్యాయం జరిగిందా..!
Mogali Rekulu Sagar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 06, 2025 | 3:31 PM

తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన సీరియల్ మొగలి రేకులు. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సీరియల్ చాలా మందికి ఫెవరేట్. ఈ సీరియల్ లోని అని క్యారెక్టర్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సీరియల్ నటులకు అభిమానులు కూడా బాగానే ఉన్నారు. కాగా మొగలి రేకులు సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సాగర్‌. ఇందులో అతను పోషించిన ఆర్కే నాయుడు పాత్రతో ఒక్క సారిగా ఫ్యామిలీ యాక్టర్‌గా మారిపోయాడు. ఈ సీరియల్ కంటే ముందు చక్రవాకం సీరియల్‌తోనూ బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు సాగర్. సీరియల్స్ తోనే కాదు సినిమాల్లోనూ నటించాడు సాగర్. ఉదయ్ కిరణ్‌ మనసంతా నువ్వే, ప్రభాస్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమాల్లోనూ క్యారెక్టర్ రోల్స్‌ పోషించాడు. అలాగే హీరోగానూ  చేసి ఆకట్టుకున్నాడు.

2016లో సిద్ధార్థ సినిమాతో హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా  ప్రభావం చూపలేదు. ఆ తర్వాత చాలా రోజుల పాటు సీరియల్స్‌, సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. మధ్యలో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అనే ఓ సినిమా చేశారు. అయితే 2021లో షాదీ ముబారక్‌ సినిమాతో మళ్లీ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు సాగర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్ విడుదల చేసిన సినిమా అప్పట్లో మంచి విజయం సాధించాడు. దీంతో సాగర్‌ సినిమాల్లోనే కంటిన్యూ అవుతాడని చాలా మంది భావించారు. అయితే అదేమీ జరగలేదు. షాదీ ముబారక్‌ మూవీ తర్వాత అసలు స్క్రీన్‌పై కనిపించలేదీ ఫ్యామిలీ యాక్టర్‌.

కాగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో సాగర్ ఓ మంచి పాత్ర పోషించాడు. ఆ సినిమా దర్శకుడు దశరద్. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఆ పాత్ర కోసం ముందుగా సాగర్ ను సంప్రదిస్తే అతను నో చెప్పాడట.. అయితే ఆ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా చేస్తున్న ఇప్పటి స్టార్ డైరెక్టర్.. సాగర్ దగ్గరకు వచ్చి ఈ క్యారెక్టర్ రాజు సుందరంతో చేపించాలని అనుకున్నారు. లక్కీగా నీకు ఆ ఆఫర్ వచ్చింది. ఈ క్యారెక్టర్‌తో నీకు మంచి క్రేజ్ వస్తుందని చెప్పాడట. అతని మాటలు నమ్మి సాగర్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేయడానికి అంగీకరించాడు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది. కానీ సాగర్ పాత్రకు అంతగా గుర్తింపు రాలేదు. దాంతో ఆ సినిమా వల్ల తనకు అనుకున్నంతగా గుర్తింపు రాకపోగా కెరీర్‌కు మైనస్ అయ్యిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో సాగర్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.