Allu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు.. ఈసారి ఇలా
సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్లాలి అనుకున్నా ఆఖరు నిమిషంలో దాన్ని రద్దు చేసుకున్నారు. రాంగోపాల్‌పేట పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బన్నీ హాస్పిటల్‌కు వెళ్లలేదు.. చిక్కడపల్లి PSలో సంతకం పెట్టి అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.
అల్లు అర్జున్‌కి రాంగోపాల్‌పేట పోలీసుల నోటీసులు ఇచ్చారు. కిమ్స్‌లో శ్రీతేజ్ పరామర్శకు రావొద్దంటూ సూచించారు పోలీసులు. రోగుల వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా చూడడం కోసమే అల్లు అర్జున్ రావొద్దని చెప్తూ నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఐనా సరే అల్లు అర్జున్ రావాలి అనుకుంటే.. ఆస్పత్రివర్గాలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులు సూచించారు. పోలీసులకు కూడా ముందే చెప్తే వచ్చి, వెళ్లే టైమ్‌లో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారు. పరామర్శకు ఎప్పుడు వస్తున్నారో రహస్యంగా ఉంచాలి అని నోటీసులో పేర్కొన్నారు.
దానివల్ల అల్లు అర్జున్ వస్తున్నాడని ఆస్పత్రి దగ్గరకు పెద్ద సంఖ్యలో అభిమానులు రాకుండా చూసేందుకు వీలుంటుందన్నారు.. అప్పుడే ఆస్పత్రిలో రోగులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడొచ్చన్నారు. ఒకవేళ మీరు కిమ్స్ ఆస్పత్రికి వస్తే ఊహించని ఘటనలు జరక్కుండా చూసేందుకు మీ సహకారం కావాలి అంటూ నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. మీనుంచి సరైన సహకారం లేకపోవడం వల్ల పబ్లిక్‌కి ఇబ్బందులు తలెత్తి, ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే దానికి మీదే బాధ్యత అంటూ నోటీసులు పేర్కొన్నారు. రాంగోపాల్‌పేట ఇన్‌స్పెక్టర్ పేరుతో ఈ నోటీసులు ఇచ్చారు.. ఈ నేపథ్యంలోనే నిన్న కిమ్స్‌కు వెళ్లాలనుకున్న అల్లు అర్జున్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆస్పత్రికి వెళ్లకుండా చిక్కడపల్లి PS నుంచే వెనుదిరిగారు.. అల్లు అర్జున్ ఆస్పత్రికి వస్తే ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తే..రోగులకు, వైద్య సేవలకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా సెక్యూరిటీ టైట్ చేశారు.. అదనపు బలగాల్ని కూడా మోహరించారు. తాజాగా కిమ్స్ ఆస్పత్రికి ఎప్పుడు రావాలి అనుకున్న తమకు సమాచారం ఇవ్వాలంటూ మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.