Rithu Chowdary: అవును నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే.. అసలు విషయం చెప్పిన రీతూ చౌదరి
సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి వారిలో రీతూ చౌదరి ఒకరు. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఈ చిన్నది పెట్టె పోస్ట్ లకు మంచి క్రేజ్ ఉంది.
జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినా వారిలో రీతూ చౌదరి ఒకరు. ముందుగా సీరియల్స్ లో నటించిన ఈ చిన్నది ఆతర్వాత జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యింది. అంతకు ముందు సింగర్ యశస్వికి స్టేజ్ పై హగ్ ఇచ్చి. లవ్ ప్రపోజల్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడు ఎవరు అంటూ సోషల్ మీడియాను గాలించారు కుర్రకారు.ఈ అమ్మడు జబర్దస్త్‌లో కొన్ని షోల్లో కనిపించింది. ఆ తర్వాత పలు టీవీ షోల్లోనూ మెరిసింది. గతంలో పలు సీరియల్స్ లో నటించింది రీతూ. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో కొన్ని స్కిట్స్ లో నవ్వులు పూయించింది. ఇక సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది ఈ హాట్ బ్యూటీ. ఈ వయ్యారి భామ రీసెంట్ గా ఊహించని చిక్కుల్లో పడింది.
ఇది కూడా చదవండి : 8th క్లాస్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఎండ్ అయ్యేసరికి ఇంటర్ అయిపొయింది.. ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
రూ. 700కోట్ల భూ స్కామ్ లో రీతూ చౌదరి పేరు బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరికి పేరు బయటకు రావడంతో ఈ చిన్నది మరోసారి హాట్ టాపిక్ గా మారింది. విజయవాడ, ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్‌లో ఆమె అడ్డంగా బుక్కయ్యాదని వార్తలు వచ్చాయి. భూ దందా పై రీతూ చౌదరి ఆమె భర్త చీమకుర్తి శ్రీకాంత్ పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం పై శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన భార్య రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులు తాను సంపాదించినవే అని అన్నారు. దాంతో అసలు రీతూ చౌదరికి పెళ్లయిందా.? అనే ప్రశ్న మొదలైంది.
ఇది కూడా చదవండి : కోయ్.. కోయ్.. కేక పెట్టించిందిరోయ్..! దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురు గత్తర లేపిందిగా..!
తాజాగా ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్న రీతూ చౌదరి అసలు విషయాలు బయట పెట్టింది. తనకు పెళ్లి అయ్యిందని క్లారిటీ ఇచ్చింది. 2022లో మేము పెళ్లి చేసుకున్నాం.. ఆరు నెలల తర్వాత విడిపోయాం. ప్రస్తుతం విడాకులు కోర్టులో ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం విడాకులకు అప్లై చేసుకున్నాం అని తెలిపింది రీతూ. విడాకులకు నేను ఒప్పుకున్నాను.. కానీ అతను ఒప్పుకోలేదు అందుకే ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉంది అని తెలిపింది. నేను శ్రీకాంత్‌తో రిలేషన్‌లో ఉన్నప్పుడు రియల్‌ఎస్టేట్ చేస్తాడని మాత్రమే తెలుసు. అలాగే మేము ఎక్కువ రోజులు కలిసి ఉండేవాళ్ళం కాదు నేను నా షూటింగ్స్ కు వెళ్లేదాన్ని నెలలో వారం రోజులు మాత్రమే కలిసి ఉండేవాళ్ళం అని చెప్పింది. అలాగే భూ దందాకు సంబంధించి తనకు ఎలాంటి విషయాలు తెలియావని, తన పేరు మీద ఎలాంటి విలువైన ఆస్తులు లేవు అని తెలిపింది రీతూ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి