ఇదేందయ్యా ఇది..! నాగ చైతన్య, సమంత, శోభిత కలిసి ఒకే సినిమాలో నటించారా.?

అక్కినేని అందగాడు నాగ చైత్యన వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. హిట్స్ , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు నాగ చైతన్య. చైతన్య కెరీర్‌లో మంచి హిట్స్ అందుకున్నాడు. సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తండేల్ సినిమాతో రానున్నాడు చై.

ఇదేందయ్యా ఇది..! నాగ చైతన్య, సమంత, శోభిత కలిసి ఒకే సినిమాలో నటించారా.?
Samantha, Naga Chaitanya, S
Follow us
Rajeev Rayala

| Edited By: Subhash Goud

Updated on: Jan 07, 2025 | 9:06 PM

అక్కినేని నాగ చైతన్య ఇటీవలే శోభితను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. వీరి వివాహం హైరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్  లో ఘనంగా జరిగింది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఆలయాలకు వెళ్తూ బిజీగా ఉన్నారు. అయితే నాగ చైతన్య శోభిత కంటే ముందు సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చైతన్య, సమంత కలిసి ఏ మాయ చేసావే సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆతర్వాత కూడా కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. అయితే అనుకోని కారణాల వల్ల సమంత, నాగచైతన్య విడిపోయారు. స్టార్ కపుల్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న సామ్, చై విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు సమంత, చైతన్య. ఇక విడిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. సమంత మాయోసైటిస్ బారిన పడటంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది. మరో వైపు నాగ చైతన్య తన సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలోనే శోభిత దూళిపాళ్ళతో ప్రేమలో పడ్డాడు. శోభిత, నాగ చైతన్య కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

కానీ సమంత, నాగచైతన్య, శోభిత కలిసి ఓ సినిమాలో నటించారని తెలుస్తుంది. ఇప్పుడు ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ సినిమా ఎదో తెలుసా.? కల్ట్ క్లాసిక్ గా నిలిచినా మజిలీ. శివ నిర్వాణం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ముందుగా దివ్యాంక కౌశిక్ పాత్రకు శోభితను అనుకున్నాడట దర్శకుడు. శోభితతో రెండు మూడు సీన్స్ కూడా షూట్ చేశారట.. ఆతర్వాత కొన్ని కారణాలతో ఆమె సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తుంది. దాంతో ఆమె ప్లేస్ లోకి దివ్యాంక కౌశిక్ ను తీసుకున్నారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో. అలాగే ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది. మజిలీ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది.

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .