Prabhas: అదృష్టం అంటే ఈ అమ్మడిదే గురూ.! ప్రభాస్ సినిమాలో జబర్దస్త్ హాట్ బ్యూటీ..
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. బాహుబలికి ముందు ఏడాదికి ఒక సినిమా అనే నిబంధన ఉండేది ప్రభాస్కి. ఈ విషయం ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే తెలుస్తుంది. దీంతో ప్రభాస్ ఏడాదికి ఒకే సినిమాలో నటించేవాడు. అయితే ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ప్రభాస్ ఆ రూల్ ని బ్రేక్ చేసి ఏడాదికి రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.
బుల్లితెర షోల్లో ప్రేక్షకులను ఆకట్టుకొని టీఆర్పీలో దూసుకుపోయిన షో ఏది అంటే అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు జబర్దస్త్. ఈ కామెడీ షో ఇష్టపడని వారు ఉండరు. జబర్దస్త్ ద్వారా చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ లు పరిచయం అయ్యారు. తమ కామెడీ టైమింగ్ తో నవ్వులు పువ్వులు పూయిస్తున్నారు. కొంతమంది సినిమాల్లో అవకాశాలు కూడా అందుకున్నారు. ఇప్పటికే చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్ట్ లు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే కొంతమంది హీరోలుగా మారారు. మరికొంతమంది దర్శకుల అవతారమెత్తారు. హీరోలుగా మరిన వారిలో సుడిగాలి సుధీర్, గెటాప్ శ్రీను, రాకింగ్ రాకేష్ తో పాటు పలువురు ఉన్నారు. అలాగే వేణు, ధనరాజ్, అదిరే అభి దర్శకులుగా మారారు. ఇదిలా ఉంటే ఇప్పుడు జబర్దస్త్ బ్యూటీకి పాన్ ఇండియా సినిమా నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తుంది.
ఓ జబర్దస్త్ బ్యూటీ తాజాగా పాన్ ఇండియా ఆఫర్ అందుకుందట… అది కూడా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అందుకుంది ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.? మరెవరో కాదు జబర్దస్త్ అందాల యాంకర్ రష్మీ గౌతమ్. యాంకర్ రష్మీ తన మాటలతో అందాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. జబర్దస్త్ ద్వారా ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ లభించింది.
నిజానికి రష్మీ టీవీ షోలతో పాటు పలు సినిమాల్లోనూ నటించింది. గతంలో కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. గుంటూరు టాకీస్ సినిమాలో తన అందాలతో కవ్వించింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలోనూ చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ 2లో అవకాశం అందుకుందాన్ని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సలార్ 2కోసం ప్రశాంత్ నీల్ టీమ్ ఆమెను సంప్రదించారని , ఆతర్వాత ఆమె ప్రశాంత్ కు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపిందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదు అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది రష్మీ చెప్తేనే తెలుస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .