8th క్లాస్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఎండ్ అయ్యేసరికి ఇంటర్ అయిపొయింది.. ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మొన్నటి వరకు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ముగ్దులయ్యారు. ఇక మరోవైపు ఈ మూవీలోని ప్రతి సాంగ్ యూట్యూ్బ్ను షేక్ చేశాయి.
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ మరికొద్దిరోజుల్లోనే మొదలు కానుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమా పాన్ గ్లోబల్ లెవల్ లో ఉంటుందని తెలుస్తుంది. అంతే కాదు ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి కొత్త రికార్డ్ సృష్టించింది.
హాలీవుడ్ దర్శకులు కూడా మన సినిమా చూసి మెచ్చుకున్నారు. రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన అందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. అలాగే ఈ సినిమాలో మల్లి పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. గోండు పిల్లగా నటించిన మల్లీ పాత్ర సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. ఆ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా.? సినిమా మొదలవడంతోనే కొమ్మ ఉయ్యాలా అంటూ పాట పాడుతూ ప్రేక్షకుల అలరించింది ఆ చిన్నారి.
ఆమె పేరు ట్వింకిల్ శర్మ. డాన్స్ ఇండియా షో ద్వారా పాపులర్ అయ్యింది ఈ చిన్నది.. ట్వింకిల్ శర్మ చాలా టీవీ షోల్లో కనిపించింది. అలాగే ఎన్నో డాన్స్ షోలు కూడా చేసింది. వీటితో పాటు ఫ్లిప్ కార్డ్ యాడ్‌లోనూ కనిపించింది. ఆర్ఆర్ ఆర్ సినిమా మొదలైనప్పుడు ఆమె ఎనిమిదో తరగతి చదువుతుందట.. సినిమా పూర్తయ్యే సమయానికి ఇంటర్ పూర్తయ్యింది. 2022లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది. ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందని అందరూ సోషల్ మీడియాలో సర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.