నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను.. షాకింగ్ విషయం చెప్పిన హాట్ బ్యూటీ

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు మీడియా ముందు మాట్లాడిన విషయం తెలిసిందే. తమకు ఎదురైనా చేదు అనుభవాలగురించి దైర్యంగా మీడియా ముందు మాట్లాడారు. క్యాస్టింగ్ కౌచ్ హీరోయిన్స్,. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఇలా చాలా మంది మాట్లాడారు. తాజాగా ఓ హాట్ బ్యూటీ కూడా తాను ఎదుర్కొన్న ఓ ఇబ్బంది గురించి మాట్లాడింది.

నేను కూడా క్యాస్టింగ్ కౌచ్  బారిన పడ్డాను.. షాకింగ్ విషయం చెప్పిన హాట్ బ్యూటీ
Bipasha Basu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 07, 2025 | 3:12 PM

సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తున్న సమస్య.. క్యాస్టింగ్ కౌచ్. చాలా మంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని షాకింగ్ విషయాలను బయట పెట్టారు. దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న సమస్యలను బయట పెడుతున్నారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు. అవకాశాలు ఇప్పిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అని తెలిపింది. స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకూ ఆమె ఎవరో మరెవరో కాదు..

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది బిపాసా బసు. ఈ ముద్దుగుమ్మ చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లకు పైగా ఉంది. ఇటీవ‌ల ఆమె సినిమా ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉంటున్నారు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది బిపాసా. ఈ ముద్దుగుమ్మ బోల్డ్ పాత్రలతో చాలా సార్లు వార్తల్లో నిలిచింది. ఈ బ్యూటీ తాజాగా తాను కూడా కాస్టింగ్ కౌచ్‌ బారిన పడినట్టు తెలిపింది. బిపాసా బసు చాలా బోల్డ్ సినిమాల్లో కనిపించింది. హాట్ సీన్స్ చేయడానికి ఎప్పుడూ వెనుకాడదు. ఇది కేవలం సినిమాల్లో మాత్రం. అయితే బిపాసా పై కొందరి అభిప్రాయం వేరు. గతంలో ఓ ప్రముఖ నిర్మాత తనను వేధించాడని తెలిపింది బిపాసా.

‘నేను గతంలో ఓ ప్రముఖ నిర్మాతతో ఓ సినిమాకు సంతకం చేశాను. ఆతర్వాత ‘మిస్సింగ్ యువర్ స్మైల్’ అంటూ నిర్మాత నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు. నాకు వింతగా అనిపించింది. నేను పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత నిర్మాత మరో మెసేజ్ పంపాడు’ అని బిపాసా తెలిపింది. ‘నేను నా సెక్రటరీని పిలిచి అడిగాను. ఈ నిర్మాతలు ‘మిస్సింగ్ యువర్ స్మైల్’ అని ఎందుకు నాకు మెసేజ్ చేస్తున్నాడు. అని అడిగాను. దాంతో అతను నాకు అసలు విషయం చెప్పాడు. ఆ నిర్మాతకు నేను స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాను. ఆ తర్వాత ఎలాంటి మెసేజ్ రాలేదు. ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకున్నాను. అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చేయడానికి వెళ్లగా.. అతను తీసుకోలేదు’ అని బిపాసా తెలిపింది.

View this post on Instagram

A post shared by Bipasha Basu (@bipashabasu)

రిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.