Marco Movie: వంద కోట్లు కలెక్ట్ చేసినా.. మార్కోను బ్యాన్ చేయాలని డిమాండ్.. ఇంతకీ ఏముందీ సినిమాలో..
ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. అయినా కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాపై విపరీతమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది అంటే అందులో ప్రేక్షకులకు నచ్చే అంశాలు చాలానే ఉంటాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అంతే కాదు ఈ మూవీని బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలోనే బెస్ట్ యాక్షన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఆ మూవీనే ‘మార్కో’. గతేడాది డిసెంబర్ 20న విడుదలైన ‘మార్కో’ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హిందీ లోనూ భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పటివరకు హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇదిలావుండగా, సినిమాపై కేరళలోనే కాకుండా చాలా చోట్ల వ్యతిరేకత వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం సినిమాలో మితిమీరిన హింస. ‘మార్కో’ సినిమాలో హింస మరీ ఎక్కువుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని హీరోలు, విలన్లు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. సీబీఎఫ్‌సీ చాలా కట్‌ల తర్వాత సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా కూడా ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉంది. సినిమాలో చాలా ఫైట్స్‌ని వీలైనంత క్రూరంగా చూపించారు. కుక్కను నోటితో నలిపి చంపిన దృశ్యం, వృద్ధురాలి కన్ను పొడిచేయడం, గర్భిణిని అతికిరాతకంగా కొట్టి చంపి సంబరాలు చేసుకోవడం ఇలా ఎన్నో సన్నివేశాలు మరీ హింసాత్మకంగా ఉన్నాయి. అందుకే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కొంత మంది స్వరం పెంచుతున్నారు.
‘యానిమల్’ సినిమాలో కూడా హింస ఉందన్న విమర్శలు వచ్చాయి. అయితే ‘మార్కో’ సినిమాతో పోల్చుకుంటే ‘యానిమల్’ చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. సినిమాలో చాలా సన్నివేశాల్లో రక్తం ఏరులై పారింది. ఉంది. సినిమా దర్శకుడు హనీఫ్ కూడా పాత్రలను అదే రకంగా డిజైన్ చేశాడు. ఆఖరికి ‘మార్కో’ సినిమాలో నటించిన కొద్దిమంది నటీనటులు కూడా ఈ వయొలెన్స్ పై అసహనం వ్యక్తం చేశారట ఇక ‘మార్కో’ సినిమా ప్రదర్శనలో కొందరు మహిళలు హింసను తెరపై చూడలేక వాంతులు చేసుకున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతూ 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయనడానికి ఇదొక మంచి ఉదాహరణ.
మార్కో సినిమాలో ఉన్ని ముకుందన్..
#Marco TAMIL in cinemas from Jan 3rd! #Marco TELUGU in Tamil Nadu from today! Jan 1st.
Book your tickets now!! pic.twitter.com/wkw3U2nuVv
— Unni Mukundan (@Iamunnimukundan) January 1, 2025
100 కోట్లకు చేరువలో..
#Marco TELUGU in TAMIL NADU from Jan 1st !! #Marco TAMIL in TAMIL NADU from Jan 3rd !! pic.twitter.com/eFE3GGhp1I
— Unni Mukundan (@Iamunnimukundan) December 31, 2024
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .