Razakar OTT: ఎట్టకేలకు ఓటీటీలో అనసూయ కాంట్రవర్సీ సినిమా.. ‘రజాకార్’ స్ట్రీమింగ్ ఎందులోనంటే?
భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి చారిత్రాత్మక అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం రజాకార్. అనసూయ, ఇంద్రజ, బాబీ సింహా తదితర స్టార్ యాక్టర్స్ ఇందులో నటించారు. గతేడాది మార్చి 15న విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది.
తెలంగాణ చరిత్రలో జరిగిన కొన్న సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం రజాకార్. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనసూయ, ఇంద్రజ, బాబీ సింహా, వేదిక, ప్రేమ, మకరంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్, తేజ్ సప్రు, జాన్ విజయ్, దేవీ ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రిలీజ్ కు ముందే ఈ సినిమా ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. కొన్ని రాజకీయ పార్టీలు రజకార్ సినిమాకు అనుకూలంగా మాట్లాడితే మరికొన్నిపొలిటికల్ పార్టీలు ఈ మూవీపై మండిపడ్డాయి. అందుకు తగ్గట్టుగానే మార్చి 15న థియేటర్లలో రిలీజైన రజాకార్ సినిమా పర్వాలేదనిపించింది. అదే సమయంలో ఓ వర్గం వారి నుంచి తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. మొత్తానికి థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన రజాకార్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా రజాకార్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈనెల 24 నుంచి ఈ కాంట్రవర్సీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఆహా. అలాగే రజాకార్ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది. కాగా థియేటర్లలో విడుదలైన దాదాపు 10 నెలల తర్వాత రజాకార్ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది.
గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన రజకార్ సినిమాకు ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలయింది. ఇప్పుడు ఓటీటీలోనూ అన్ని భాషల్లోనూ ఈ సినిమా సందడి చేయనుంది. నిజాం పాలనలో రజాకార్లు ఓ వర్గం వారిని టార్గెట్ చేస్తూ ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డారనే అంశాలతో రజాకార్ సినిమాను తెరకెక్కించినట్లు మేకర్స్ చెబుతున్నారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే మరికొన్ని రోజుల్లో ఓటీటీలోకి రానుంది. ఎంచెక్కా చూసి ఎంజాయ్ చేయండి.
ఆహాలో స్ట్రీమింగ్..
Courage, history, and an untold tale! 💪🏽📚🔥 #Razakar Premiering January 24th, only on Aha pic.twitter.com/qoOhsakILt
— ahavideoin (@ahavideoIN) January 7, 2025
రజాకార్ సినిమాలో అనసూయ..
The chilling truth of the silent genocide of Hindus by Razakars in Hyderabad, the history that was hidden, is finally becoming mainstream through cinema.
Razakar, in cinemas on 15th March, should be a must-watch for people interested in truth. pic.twitter.com/kS4bly9lXl
— BALA (@erbmjha) March 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.