jr NTR-Ram charan-Prabhas: ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్ – తారక్.! ఆ విషయమేనా..
ఇప్పుడు ప్రభాస్ అందరికీ మార్గదర్శి అవుతున్నారు. అప్పట్లో పాన్ ఇండియా మార్కెట్ ను పరిచయం చేసిన రెబల్ స్టార్.. ఇప్పుడు మరో విషయంలోనూ హీరోలకు రూట్ మ్యాప్ గా మారిపోయాడు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అయితే గుడ్డిగా ప్రభాస్‌ను ఫాలో అవుతున్నారు. అదెలా..? వాళ్లు ఏ విషయంలో ప్రభాస్‌ను ఫాలో అవుతున్నారో తెలుసుకోవాలంటే.. ఈ వీడియో ఫుల్‌గా చూడాల్సిందే.
గ్యాప్ లేకుండా సినిమాలు చేయడంలో ప్రభాసే అందరికీ రోల్ మోడల్ అవుతున్నారు. సాహో తర్వాత ప్రభాస్ ఈ ఫార్ములానే అప్లై చేస్తున్నారు. అందుకే ఆర్నెళ్లకో సినిమా విడుదల చేస్తున్నారు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు సైన్ చేయడం వల్ల.. తక్కువ గ్యాప్‌లోనే రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వచ్చాయి.. 2024లో కల్కి వచ్చింది. ఏప్రిల్ 10న రాజా సాబ్ రాబోతుంది. ఇదే రూట్ చరణ్ ఫాలో అవుతున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ చివరిదశకు రాగానే.. బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలు వారం గ్యాప్‌లోనే ప్రకటించారు. ఓ వైపు గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూనే.. RC16 రెగ్యులర్ షూట్‌లోనూ జాయిన్ అయ్యారు రామ్ చరణ్. సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో బుచ్చిబాబు సినిమాపై ఫోకస్ చేయనున్నారు. 2025 జూన్‌లోపు RC16 షూట్ పూర్తి కానుంది. అలాగే 2025 డిసెంబర్ నుంచి సుకుమార్ సినిమా మొదలు కానుంది. ఈ రెండు సినిమాలు తక్కువ గ్యాప్‌లోనే విడుదల కానున్నాయి.
ఇక ఎన్టీఆర్ కూడా ఇదే చేస్తున్నారు. దేవరతో పాటే వార్ 2కి డేట్స్ ఇచ్చారు తారక్. దేవర విడుదలయ్యాక వార్ 2 పూర్తి చేస్తున్నారు. 2025 సమ్మర్ లోపే వార్ 2 రానుంది. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా రెడీగా ఉంది. ఇది పూర్తి అయ్యేలోపే దేవర 2 స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు కొరటాల. వరస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తే.. ఎంత అడ్వాంటేజ్ ఉందో ప్రభాస్ చూపించారు. అదే రూట్ ను చరణ్, ఎన్టీఆర్ ఫాలో అవుతున్నారిప్పుడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.