AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Light Pollution: కాంతి కాలుష్యంతో డయాబెటిస్.. శరీరంపై తీవ్ర ప్రభావం.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..

సాధారణంగా మీరు వాయు కాలుష్యం లేదా శబ్ద కాలుష్యం గురించి వినే ఉంటారు. అయితే లైట్ పొల్యూషన్ గురించి విన్నారా? ఇది విని ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం..

Light Pollution: కాంతి కాలుష్యంతో డయాబెటిస్.. శరీరంపై తీవ్ర ప్రభావం.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..
Light Pollution
Shaik Madar Saheb
|

Updated on: Nov 18, 2022 | 10:55 AM

Share

సాధారణంగా మీరు వాయు కాలుష్యం లేదా శబ్ద కాలుష్యం గురించి వినే ఉంటారు. అయితే లైట్ పొల్యూషన్ గురించి విన్నారా? ఇది విని ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం.. కానీ.. దీనితో కూడా ప్రమాదమేనని తాజా అధ్యయనంలో నిర్ధారణ అయింది. లైట్ పొల్యూషన్ అంటే.. అధిక కాంతి కాంతి కాలుష్యం అని అర్ధం.. పండగలలో మెరిసే దీపాలు మనకు చాలా ఇష్టం. కానీ అది మధుమేహ వ్యాధిని ఆహ్వానిస్తోంది.. అన్ని రకాల కృత్రిమ కాంతి, మొబైల్-ల్యాప్‌టాప్, ఎల్‌ఈడీ, కార్ హెడ్‌లైట్ లేదా హోర్డింగ్‌ల ప్రకాశవంతమైన కాంతి వంటి గ్యాడ్జెట్‌లు కూడా మిమ్మల్ని మధుమేహ బాధితులను చేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాంతి కాలుష్యం క్రమంగా శరీరాన్ని ప్రభావితం చేస్తుందని చైనా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

పరిశోధనలో ఏం తేలింది?

లైట్ పొల్యూషన్‌కు సంబంధించిన పరిశోధన చైనాలో జరిగింది. దీనికి సంబంధించి చైనా వ్యాప్తంగా దాదాపు లక్ష మందిపై పరిశోధనలు చేశారు. స్ట్రీట్ లైట్లు, స్మార్ట్‌ఫోన్‌లు వంటి అన్ని కృత్రిమ లైట్లు మధుమేహ ప్రమాదాన్ని 25 శాతం పెంచుతాయని పరిశోధనలో తేలింది. పరిశోధన ప్రకారం.. రాత్రిపూట కూడా మనకు పగటి అనుభూతిని కలిగించే ఈ లైట్లు మానవుల శరీర చక్రాన్ని మారుస్తాయని.. ఇది క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. దీని కారణంగా.. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే మన శరీర సామర్థ్యం తగ్గుతుంది. ప్రపంచ జనాభాలో 80 శాతం మంది రాత్రిపూట చీకటిలో కాంతి కాలుష్యం బారిన పడుతున్నారని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి.

కాంతి కాలుష్యం కారణంగా మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు..

కాంతి కాలుష్యం కారణంగా చైనాలో 90 లక్షల మంది మధుమేహ బాధితులుగా మారారని అధ్యయనం తెలిపింది. ఈ ప్రజలు చైనాలోని 162 నగరాల్లో నివసిస్తున్నారు. ఇవన్నీ చైనా నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ సర్వేలెన్స్ స్టడీలో పొందుపరిచారు.. ఇందులో ఈ వ్యక్తుల పూర్తి జీవనశైలి వివరాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిపై ప్రభావం..

చైనాలో నిర్వహించిన ఈ అధ్యయనంలో చీకటి, కృతిమ కాంతి ప్రభావాన్ని గుర్తించారు. చీకటిలో కన్నా ఎక్కువసేపు కృత్రిమ కాంతిలో ఉండేవారిలో 28 శాతం మందికి ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఉందని తేలింది. ప్రజలలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణం. వాస్తవానికి ఈ హార్మోన్ మన జీవక్రియ వ్యవస్థను చక్కగా ఉంచుతుంది. అంతే కాదు, ఎక్కువ సేపు వెలుతురులో ఉండడం వల్ల ఏమీ తినకుండానే శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరగడం మొదలవుతుందని పరిశోధకులు వెల్లడించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..