Health Tips: చలికాలంలో జలుబు, దగ్గు వేధిస్తున్నాయా? ఈ ఆయుర్వేదం టీ లతో రిలీఫ్ పొందండి..
వర్షాకాలంలో ఎన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతాయో.. శీతాకాలంలోనూ అదే విధంగా పరిస్థితి ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా చాలా మంది..
వర్షాకాలంలో ఎన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతాయో.. శీతాకాలంలోనూ అదే విధంగా పరిస్థితి ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటారు. వాతావరణంలో సడెన్ మార్పులు కూడా జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చలికాలంలో ఎక్కువగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలలో శ్వాసకోశ సమస్యలు ఒకటి. పొడి దగ్గు ఈ సీజన్‌లో సర్వసాధారణం. శ్లేష్మం లేకుండా పొడి దగ్గుకు అనేక కారణాలు ఉన్నాయి. అలెర్జీలు, ఆస్తమా, ఇన్ఫెక్షన్లు, యాసిడ్ రిఫ్లక్స్ వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. సాధారణంగా చిన్నపాటి జలుబు, దగ్గు సమస్యకు చాలా మంది తమకు తెలిసిన, సాధారణ మెడిసిన్స్‌ను వినియోగిస్తుంటారు. అయితే అవి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయి. వ్యాధి మూలాలను తగ్గించవు. కానీ, వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు ఈ సమస్యను పూర్తిగా తగ్గించేస్తాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అల్లం టీ:
దగ్గుకు ఉత్తమమైన ఆయుర్వేద మూలికలలో అల్లం ఒకటి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. గొంతు నొప్పి, గొంతులో గరగర, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉదయాన్నే వేడి వేడి అల్లం టీ తాగితే ఈ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి.
తేనె:
ప్రతి సంవత్సరం చలికాలంలో పొడి దగ్గు ఉంటే.. టీ లేదా వేడి నీటిలో సేంద్రీయ తేనె కలిపి తాగాలి. ఇందులోని యాంటీబయాటిక్స్ గొంతు నొప్పి, జలుబు, దగ్గు సమస్యలన్నింటినీ తొలగిస్తుంది.
లైకోరైస్:
సాంప్రదాయ ఆయుర్వేద మూలికలలో లైకోరైస్ ఒకటి. దగ్గు, ఉబ్బసం, గొంతునొప్పికి అద్భుతమైన ఔషధం. లైకోరైస్ కాడను నీటిలో ఉడకబెట్టి, కషాయం మాదిరిగా చేసి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఇది పొడి దగ్గును త్వరగా తగ్గిస్తుంది.
వెల్లుల్లి:
పొడి దగ్గు సమస్యతో బాధపడుతున్న వారికి వెల్లుల్లి గొప్ప వరం అని చెప్పొచ్చు. ఒక వెల్లుల్లి రెబ్బను పాలలో ఉడకబెట్టి, ఆ తరువాత చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఇది పొడి దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
థైమ్ టీ:
పొడి దగ్గును తగ్గించడానికి మరొక ఆయుర్వేద హెర్బల్ టీ థైమ్ టీ. ప్రతి శీతాకాలంలో జలుబు, దగ్గుతో బాధపడుతుంటే.. ఈ హెర్బల్ టీని తాగవచ్చు. పొడి దగ్గు, కోరింత దగ్గు చికిత్స కోసం ఐరోపాలో ఎక్కువగా ఉపయోగించే మూలికలలో ఇది ఒకటి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..