AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: భోజనం చేసే సమయంలో నీటిని తాగుతున్నారా.. వెంటనే ఆ అలవాటును మానుకోండి.. లేకుంటే మాత్రం..

నీరు (Water) అనేది సమస్త ప్రాణకోటికి అత్యంత ఆవశ్యకమైన పదార్థం. నీరు లేకపోతే భూమిపై ఉండే ఏ జీవి మనుగడ సాధించలేదు. ఆహారం లేకుంటే కొన్ని రోజులైనా బతకగలం కానీ నీరు లేనిదే ఒక్క పూట కూడా జీవించలేని...

Health: భోజనం చేసే సమయంలో నీటిని తాగుతున్నారా.. వెంటనే ఆ అలవాటును మానుకోండి.. లేకుంటే మాత్రం..
Water Drinking With Meals
Ganesh Mudavath
|

Updated on: Nov 18, 2022 | 9:13 AM

Share

నీరు (Water) అనేది సమస్త ప్రాణకోటికి అత్యంత ఆవశ్యకమైన పదార్థం. నీరు లేకపోతే భూమిపై ఉండే ఏ జీవి మనుగడ సాధించలేదు. ఆహారం లేకుంటే కొన్ని రోజులైనా బతకగలం కానీ నీరు లేనిదే ఒక్క పూట కూడా జీవించలేని పరిస్థితి. నీరు ఆరోగ్యానికి చాలా అవసరం. రోజుకు కనీసం 3 లీటర్లు నీరు తాగాలని వైద్యులు చెబుతంటారు. నీటిని ఎంత ఎక్కువగా తాగితే అంత ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది భోజనం చేసే సమయంలో మధ్య మధ్యలో నీళ్లు తాగుతుంటారు. కొంతమంది భోజనం చేయడానికి ముందు మంచి నీరు తాగుతారు. అయితే ఇలా మధ్య మధ్యలో నీళ్లు తాగడం మంచిదేనా అనే విషయంపై నిపుణులు ఆసక్తికర విషయాలను చెబుతున్నారు. భోజనం (Meals) మధ్యలో నీళ్లు తాగడం వల్ల ఆహారం జీర్ణం అవడం కష్టం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల టాక్సిన్స్ పేరుకుపోతుందని, ఆయుర్వేదం ప్రకారం కూడా భోజనం మధ్యలో నీళ్లు తాగొద్దనే విషయాన్నే చెబుతోందని వివరిస్తున్నారు. భోజనంతో పాటు నీటిని తాగడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు, పోషకాలను జీర్ణం చేసుకోవడం ఆలస్యం అవుతుందని, ఇది జీర్ణక్రియ సక్రమంగా సాగేందుకు అవరోధం కలిగిస్తుందని చెబుతున్నారు.

భోజనం చేసే సమయంలో ఎలాంటి నీటిని తాగుతున్నారనే విషయం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆల్కలిన్ వాటర్ పొట్టలోని ఆమ్లాలు మరింత పెంచుతాయి. భోజనం చేసిన తర్వాత నీళ్లు తీసుకోవడం అనేది శరీరం తీరుపై ఆధారపడి ఉంటుంది. అవసరం లేదనుకుంటే అన్నం తిన్న కొద్దిసేపటి తర్వాత తాగడమే మంచిది. అయితే.. భోజనం మధ్యలో నీరు తాగకుండా ఉండటమే మంచిది అనే విషయాన్ని నిరూపించేందుకు సైంటిఫిక్ గా ఎటువంటి అధ్యయనాలు లేవని నిపుణులు స్పష్టం చేశారు.

అయితే.. స్నానానికి ముందు ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల రక్త పోటు అదుపులో ఉండటమే కాకుండా కంట్రోల్ లో ఉంటుంది. కొంత మందికి వేడి నీటితో స్నానం చేసిన తర్వాత నీళ్లు తాగాలని అనిపిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడటానికి భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగాలి. అయితే ఎక్కువ మొత్తంలో నీటిని తాగవద్దు. ఇలా చేయడం వల్ల జీర్ణ రసాలు పలచన అవుతాయి. ఆహారం తీసుకున్న ఒక గంట తర్వాత నీటిని తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి