AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Sweat: చలికాలంలోనూ విపరీతంగా చెమట పడుతోందా? ఈ వ్యాధులకు సంకేతం కావొచ్చు.. తస్మాత్ జాగ్రత్త

చలికాలంలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల మన శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది మానసిక ఆందోళనకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఇది నిరాశ లేదా తీవ్ర ఆందోళనలను కలిగిస్తుంది.

Winter Sweat: చలికాలంలోనూ విపరీతంగా చెమట పడుతోందా? ఈ వ్యాధులకు సంకేతం కావొచ్చు.. తస్మాత్ జాగ్రత్త
Winter Sweat
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 18, 2022 | 6:58 AM

Share

చెమట పట్టడం ఆరోగ్యానికి మంచిదే. చెమట ద్వారా శరీరంలోని విషపూరిత, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే చెమట మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అయితే శీతకాలంలో చల్లని వాతావరణంలో అధిక చెమట పడుతున్నట్లయితే అది కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతం కావొచ్చు. లక్నోలోని కేర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఎండీ డాక్టర్ సీమా యాదవ్ చలికాలంలో చెమటలు పట్టడానికి కారణమేమిటో, అది ఎలాంటి తీవ్రమైన వ్యాధులకు సంకేతమో చెప్పుకొచ్చారు. మన శరీర సగటు ఉష్ణోగ్రత 98.8 . అయితే బాడీ టెంపరేచర్‌ 100 కంటే ఎక్కువ ఉంటే మాత్రం జ్వరం లాంటి సమస్యలు ఉన్నట్లే. ఇక చలికాలంలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల మన శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది మానసిక ఆందోళనకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఇది నిరాశ లేదా తీవ్ర ఆందోళనలను కలిగిస్తుంది. ఇక చలికాలంలో చాలామంది బజ్జీలు, పకోడీలు వంటి వేడి వేడిగా ఉండే పదార్థాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇది కూడా చెమటకు కారణం. అయితే ఈ చెమట కొంత కాలం మాత్రమే. మీకు విపరీతమైన చెమట పట్టినట్లయితే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది తక్కువ చక్కెర స్థాయి, మహిళల్లో మెనోపాజ్ సమస్యలు, ఊబకాయం, హైపర్హైడ్రోసిస్ లేదా తక్కువ రక్తపోటు వంటి సమస్యలకు సంకేతం కావచ్చు.

లోబీపీ

చలికాలంలో విపరీతంగా చెమటలు పట్టడం తక్కువ రక్తపోటుకు సంకేతం. దీని కారణంగా ఒక్కోసారి గుండెపోటు కూడా రావచ్చు, వాస్తవానికి, చల్లని వాతావరణంలో తక్కువ రక్తపోటు కారణంగా, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో కాల్షియం పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. అందుకే చెమటలు పట్టి గుండె వేగం ఒక్కసారిగా పెరుగుతుంది.

హైపర్ హైడ్రోసిస్

హైపర్ హైడ్రోసిస్ ఉంటే ఏ సీజన్‌లోనైనా విపరీతంగా చెమట పడుతుంది. ముఖంతో పాటు, అరచేతులు, అరికాళ్ళపై విపరీతమైన చెమట ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడానికి చెమట పట్టడం అవసరం. కానీ అరచేతులు, అరికాళ్ళు, ముఖంపై అధిక చెమట ఉన్నట్లయితే అది హైపర్ హైడ్రోసిస్ లక్షణం కావొచ్చు.

ఇవి కూడా చదవండి

షుగర్‌ లెవెల్స్‌

శరీరంలో చక్కెర పరిమాణం తగ్గడం ప్రారంభిస్తే, అది చెమటకు దారితీస్తుంది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి సాధారణ చక్కెర స్థాయి ఖాళీ కడుపుతో 1 డెసిలీటర్ రక్తంలో 70 నుండి 100 mg ఉండాలి. షుగర్ లెవెల్ అంతకన్నా తగ్గితే చెమటలు పట్టడం మొదలవుతుంది.

మెనోపాజ్‌

45 లేదా 50 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళలకు చలికాలంలో చెమటలు పడుతున్నట్లయితే అది మెనోపాజ్‌కు సంకేతం కావచ్చు. అలాగే ఊబకాయం వల్ల కూడా చలికాలంలో చెమటలు పడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం ఎక్కువగా ఉంటే చెమట ఎక్కువగా పడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి