Jobs in Kailasam: కైలాసంలో ఉద్యోగాలు.. నిత్యానంద సంచలన ప్రకటన..అర్హులైనవారు దరఖాస్తు చేసుకోండి.
నిత్యానందస్వామి.. ఈ పేరు ఎప్పుడు విన్నా అందరికీ ఆసక్తికరమే. తమను తాము భగవంతుడి అవతారంగా చెప్పుకునే దొంగ బాబాలు అందరిలోకీ ఘటికుడుగా పేరుపొందాడు నిత్యానంద.
నిత్యానందస్వామి.. ఈ పేరు ఎప్పుడు విన్నా అందరికీ ఆసక్తికరమే. తమను తాము భగవంతుడి అవతారంగా చెప్పుకునే దొంగ బాబాలు అందరిలోకీ ఘటికుడుగా పేరుపొందాడు నిత్యానంద. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రకటనలు వివాదాస్పదంగా మారుతుంటాయి. ఈ మధ్య కాలంలో కైలాసం అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు స్వయంగా ప్రకటించుకున్న నిత్యానంద.. ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. తమ దేశంలో ఉద్యోగాలు ఉన్నాయని, అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇండియాలోని తమ ప్రతినిధుల సహాయంతో కైలాసంలో ఉద్యోగాలు చేయవచ్చని ఇంటర్నెట్ లో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. తమ శాఖల్లో ఒక సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకుని, అర్హత సాధించిన వారికి కైలాసంలో పని చేసేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. శిక్షణ సమసంలో భృతి కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. నిత్యానంద హిందూ విశ్వ విద్యాలయం, విదేశాల్లోని దేవాలయాలు, విద్యుత్తు శాఖ, గ్రంథాలయం, భారతదేశంలోని కైలాస ఆలయాలు, కైలాస రాయబార కార్యాలయం, కైలాస ఐటీ విభాగం తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. కాగా.. గతంలో నిత్యానంద చనిపోయారనే వార్త కలకలం రేపగా తాను బతికే ఉన్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. భారత్ వదిలి రెండేళ్ల క్రితం ఈక్వెడార్ కు పారిపోయాడు. ఏకంగా తన కైలాసం అంటూ సొంత రాజ్యాన్ని స్థాపించాడు. అంతేకాదు నిత్యానందకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ‘కైలాస’ అధికారిక వెబ్‌సైట్ అందిస్తుంటుంది. ఫేస్బుక్లో ఫొటోలు, వీడియోలను అప్డేట్ చేస్తుంటుంది. ఆయన ఫొటోలు సహా, ఆయన పేపర్‌పై రాస్తున్నట్లు ఉన్న చిత్రాలను షేర్ చేసింది. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై నిత్యానంద స్వామి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ప్రసుత్తం సమాధిలోకి వెళ్లానని.. మాట్లాడలేకపోతున్నానని.. మనుషులను గుర్తు పట్టలేకపోతున్నట్లు నిత్యానంద స్వామి వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

