Viral wedding: ధూమ్ ధామ్‌గా జరిగిన పెళ్లి.. కానీ వచ్చిన వాళ్లంతా షాక్.. ఎందుకంటే..? వైరల్ వీడియో.
పెళ్లిళ్లలో జరిగే సంఘటనలు భలే విచిత్రంగా ఉంటాయి. ఇలాంటివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ పెళ్లి కూడా వైరల్ అవుతుంది.
గురుగ్రామ్‌లోని పాలం విహార్‌లోని జిలే సింగ్ కాలనీలో షేరు అనే వరుడు స్వీటీ అనే వధువును వివాహం చేసుకున్నాడు. భారతీయ వివాహ సంప్రదాయాల ప్రకారం వివాహం ఘనంగా ఆచారాలకు తగ్గట్టు తల్లిదండ్రులు నిర్వహించారు. ఇరుగుపొరుగు వారందరూ ప్రేమగా ఆనందంతో పెళ్లిలో పాల్గొన్నారు. వరుడి తల్లి స్వయంగా కల్యాణ మండపాన్ని అలంకరించారు. అందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా..? షేరు-స్వీటీ అంటే మనుషులు కాదు కుక్కలు. స్వీటీ తల్లి సవిత మాట్లాడుతూ.. ‘తన భర్త గుడి సమీపంలోని కుక్కలకు నిత్యం ఆహారం ఇచ్చేవాడని, ఒకరోజు అతను ఇంటికి వస్తుండగా ఒక కుక్క అతనిని అనుసరించి తమ ఇంటికి వచ్చిందని, అప్పటి నుంచి ఆ కుక్కను పిల్లలు లేని తాము కూతురిలా పెంచుకున్నామన్నారు.అయితే తమ స్వీటీకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్న సవిత దంపతులు పక్క ఇంట్లో పెరిగే షేరు అనే మగ కుక్కతో వివాహం నిశ్చయించారు. ఇరు కుటుంబాల అంగీకారంతో నాలుగు రోజుల్లో పెళ్లికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. అంతేకాదు ఈ పెళ్లికి 100 మందిని ఆహ్వానించారు. పెళ్లి పత్రికలను కూడా పంచారు. ఆన్‌లైన్ ఆహ్వానాలు కూడా పంపారు. ఈ వివాహాన్ని ఇరుగుపొరుగున కొందరు స్వాగతించగా మరికొందరు వ్యతిరేకించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

