AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పాదాలపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. ఇలాంటి సైలెంట్‌ కిల్లర్‌తో జర భద్రం..!

అది గుండెపై ప్రభావం చూపినప్పుడు దాని లక్షణాలు కొన్ని శరీరంలో వ్యక్తమవుతాయి. అటువంటి లక్షణాల గురించి ప్రతిఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిందే..

మీ పాదాలపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. ఇలాంటి సైలెంట్‌ కిల్లర్‌తో జర భద్రం..!
Pad
Jyothi Gadda
|

Updated on: Nov 28, 2022 | 8:13 AM

Share

మనం నిత్య జీవితంలో రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటాం. వీటిలో చాలా తేలికగా మనిషిని బలహీన పరిచేవి కూడా కొన్ని ఉంటాయి. అలాంటి ఆరోగ్య సమస్యలకు సరైన సమయంలో తగిన చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం కావచ్చు. వీటిలో బిపి (రక్తపోటు), కొలెస్ట్రాల్, మధుమేహం వంటివి ప్రాణాంతకంగా మారుతుంటాయి. వీటిని మనం జీవనశైలి వ్యాధులుగా పరిగణిస్తాము. బిపి, కొలెస్ట్రాల్ రెండూ మనిషి గుండె జబ్బులకు, ముఖ్యంగా గుండెపోటుకు గురిచేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. గుండెపోటు మాత్రమే కాదు, స్ట్రోక్‌లు కూడా ఎదురవుతుంటాయి. ఒక వ్యక్తిలో BP ప్రారంభాన్ని, BP పెరుగుదలను కూడా గుర్తించలేడు. అందుకే నిపుణులు కూడా బీపీని ‘సైలెంట్ కిల్లర్’గా అభివర్ణిస్తున్నారు. కానీ బీపీ పెరిగి అది గుండెపై ప్రభావం చూపినప్పుడు దాని లక్షణాలు కొన్ని శరీరంలో వ్యక్తమవుతాయి. అటువంటి లక్షణాల గురించి ప్రతిఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిందే..

బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె మరింత ఒత్తిడికి లోనవుతుంది. ఈ ఒత్తిడి ధమనులలోని కణాలకు నష్టం కలిగిస్తుంది. శరీరంలో ఎక్కడైనా ధమనులు దెబ్బతింటాయి. కానీ ఇది ఎక్కువగా శరీరం కింది భాగంలో అంటే కాళ్లలో కనిపిస్తుంది. ఎందుకంటే గుండెకు రక్త ప్రసరణకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. హై బీపీతో పరధీయ ధమని(PAD) వ్యాధి సంభవిస్తుంది. పరిధీయ ధమని వ్యాధి రక్తప్రవాహనికి సంబంధించిన రుగ్మత. ఈ స్థితిలో కొన్ని ధమనులు శరీరంలోకి తక్కువ రక్తాన్ని పంపిస్తాయి. పరిధీయ ధమని వ్యాధి వచ్చినప్పుడు పాదాలు సాధారణంగా ప్రభావితమవుతాయి. లక్షణాలు నడవడానికి ఇబ్బంది, పాదాలలో నొప్పి ఉండవచ్చు.

అయితే, PAD ఎప్పుడూ ప్రమాదకరమైన పరిస్థితి కాదు. కానీ బీపీ గుండెపై ప్రభావం చూపిందనడానికి ఇది సంకేతం. ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవాలి. లేదంటే హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్ కి దారి తీస్తుంది. ఇలా కాలికి రక్తప్రసరణ తగ్గిపోయిందని తెలుసుకోవటానికి ఏర్పడే కొన్ని లక్షణాలను పరిశీలించినట్టయితే..

ఇవి కూడా చదవండి

అసాధారణంగా చల్లటి పాదాలు, ఎరుపు లేదా నీలం రంగులోకి మారుతుంటాయి. కాళ్ళపై జుట్టు రాలడం, కొన్ని సందర్భాల్లో కాలి వేళ్ళలో తేలికపాటి జలదరింపు ఉంటుంది.. అదేవిధంగా, అధిక కొలెస్ట్రాల్ PADకి దారి తీస్తుంది. ఇది కూడా గుండె ప్రమాదంలో ఉందని సూచిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి