cat hospital: గాయపడిన పిల్లి.. నేరుగా ఆస్పత్రికి వెళ్లి.. ఆపై.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.
గాయపడిన పిల్లి నేరుగా ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. తూర్పు టర్కీలోని బిట్లిస్ తత్వన్ స్టేట్ ఆస్పత్రిలో ఈ ఘటన జరగ్గా ఈ క్లిప్‌ను ఆస్పత్రి ఫేస్‌బుక్ అధికారిక పేజ్‌లో షేర్ చేశారు.
గాయపడిన పిల్లి నేరుగా ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. తూర్పు టర్కీలోని బిట్లిస్ తత్వన్ స్టేట్ ఆస్పత్రిలో ఈ ఘటన జరగ్గా ఈ క్లిప్‌ను ఆస్పత్రి ఫేస్‌బుక్ అధికారిక పేజ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో బ్లాక్ అండ్ వైట్ క్యాట్ ఆస్పత్రిలోకి వచ్చి తిరుగుతుండటం కనిపించింది. గాయపడిన పిల్లి తనకు చికిత్స అందించేందుకు ఎవరో ఒకరు వస్తారని వేచిచూసింది.ఆపై క్యాట్‌ను గమనించిన డాక్టర్ దానికి వైద్యం సాయం అందించారు. పిల్లి గాయాలను గమనించి బ్యాండేజ్ వేసారు. ఈ వీడియోకు పెద్ద ఎత్తున వ్యూస్ రాగా పలువురు యూజర్లు కామెంట్స్‌తో రియాక్టయ్యారు.ఆస్పత్రిలోకి పిల్లి రావడం తాను గమనించానని, దాన్ని దగ్గరకు తీసుకుని పరిశీలించగా కాలికి గాయమైనట్టు గుర్తించి చికిత్స అందించి కొద్దిసేపు ఆస్పత్రిలో ఉంచగా కోలుకున్న క్యాట్ తిరిగి వెళ్లిపోయిందని అబుజర్ ఒదెమిర్ ఓ వార్తాసంస్ధతో చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..