Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మనిషి జీవితంలో ఈ 4 కారణాలు అనేక సమస్యలు తెస్తాయంటున్న ఆచార్య చాణక్య

రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలు నీతి శాస్త్రంలో వివరించారు. ఇందులో వైవాహిక జీవితం, కెరీర్, ఆరోగ్యం, మనుషుల మధ్య సంబంధాలు, ఉద్యోగానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు.

Chanakya Niti: మనిషి జీవితంలో ఈ 4 కారణాలు అనేక సమస్యలు తెస్తాయంటున్న ఆచార్య చాణక్య
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Dec 01, 2022 | 6:11 PM

ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త. ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, దౌత్యం కాకుండా జీవితానికి సంబంధించిన అనేక విషయాల గురించి కూడా చెప్పారు. చాణక్యుడు వ్యక్తిగా, కుటుంబంలో ఒకనిగా, సమాజంలో ఒక సభ్యునిగా, ఒక పాలకునిగా ఆచరింపవలసిన కర్తవ్యాలు, పాటించవలసిన నియమాలను తెలియజేశారు. నీతి శాస్త్రంలో దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలను ఆయన ప్రస్తావించారు. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలు నీతి శాస్త్రంలో వివరించారు. ఇందులో వైవాహిక జీవితం, కెరీర్, ఆరోగ్యం, మనుషుల మధ్య సంబంధాలు, ఉద్యోగానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు. ఈ విధానాలు చాలా ప్రసిద్ధమైనవి. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు.  జీవితంలో వచ్చే అతి పెద్ద సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితంలో సమస్యలను సృష్టించగల కొన్ని కారణాలను కూడా చెప్పాడు.

ऋणकर्ता पिता शत्रुर्माता च व्यभिचारिणी

भार्या रूपवती शत्रु: पुत्र: शत्रुरपण्डित:

ఇవి కూడా చదవండి

అప్పులపాలైన తండ్రి, పిల్లల మధ్య విచక్షణ చూపించే తల్లి, అత్యంత అందమైన భార్య, అజ్ఞాని కొడుకు శ్రతువులను అర్ధం

రుణం – ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. అప్పు చేసే తండ్రి.. కొడుక్కి శత్రువు కంటే తక్కువ ఏమీ కాదని అర్ధం. పిల్లలను సరిగ్గా చూసుకోవడం తండ్రి బాధ్యత. అయితే పిల్లల్ని పెంచడం అనే కారణంతో రుణం తీసుకుంటే.. తరువాత అతని పిల్లలు ఈ రుణాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. ఆ తండ్రి తన పిల్లలకు అతిపెద్ద శత్రువుగా మారతాడు.

వివక్ష – ఆచార్య చాణక్యుడు ప్రకారం.. తన పిల్లల పట్ల వివక్ష చూపే తల్లి పిల్లల మధ్య సంబంధాలలో చీలికను కలిగిస్తుంది. ఇది కుటుంబ సంబంధాలను పాడు చేస్తుంది. అలాంటి తల్లి తన బిడ్డలకు శత్రువు.

భార్య అందం – ఆచార్య చాణక్యుడు ప్రకారం, భార్య అందం భర్తకు ఒకొక్కసారి ఇబ్బంది కలిగించవచ్చు. తనను గౌరవించని భర్తకి భార్య విలువ ఇవ్వదు. ఒకొక్కసారి తన భార్య ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకుంది అనే అనుమానం భర్త వ్యక్తం చేస్తాడు. ఇది భార్యాభర్తల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

తెలివితక్కువ పిల్లలు – ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లలకి తెలివితేటలు లేకుంటే.. అది తల్లిదండ్రులకు అత్యంత బాధాకరమైన విషయం. అజ్ఞాననం కలిగిన పిల్లలు తల్లిదండ్రులకు శత్రువు కంటే తక్కువ కాదు. ఇలాంటి పిల్లలు ఎల్లప్పుడూ తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తాడు. భవిష్యత్తులో తీవ్ర ప్రభావం పడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)