Chanakya Niti: మనిషి కష్ట సమయంలో కూడా సుఖంగా జీవించాలంటే.. డబ్బుని ఇలా ఖర్చు చేయమంటున్న చాణక్య

సంపాదనను సంయమనంతో భద్రంగా ఉంచుకునే వ్యక్తుల దగ్గర సంపద వృద్ధి చెందుతుంది. ఆచార్య చాణక్యుడు డబ్బును ఉపయోగించుకోవడానికి కొన్ని మార్గాలను చెప్పాడు.. ఈ మార్గాలను అనుసరించే వారు సంక్షోభ సమయాల్లో కూడా సంతోషంగా జీవిస్తారు. 

Chanakya Niti: మనిషి కష్ట సమయంలో కూడా సుఖంగా జీవించాలంటే.. డబ్బుని ఇలా ఖర్చు చేయమంటున్న చాణక్య
Chanakya Neeti
Follow us
Surya Kala

|

Updated on: Dec 02, 2022 | 5:49 PM

డబ్బు లేకుండా మనిషి జీవితం గడపడం అసాధ్యం. డబ్బు అనేది ప్రతి వ్యక్తి మంచి చెడులకు గుర్తింపునిస్తుంది. చాణక్య నీతి ప్రకారం, డబ్బు విలువను అర్థం చేసుకున్న వ్యక్తి సంపన్నుడు. అయితే సంపదను రక్షించుకోలేని వ్యక్తి.. సింహాసనం మీద నుంచి నేల మీదకు దిగిరావాల్సిందే. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. సంపాదనను సంయమనంతో భద్రంగా ఉంచుకునే వ్యక్తుల దగ్గర సంపద వృద్ధి చెందుతుంది. ఆచార్య చాణక్యుడు డబ్బును ఉపయోగించుకోవడానికి కొన్ని మార్గాలను చెప్పాడు.. ఈ మార్గాలను అనుసరించే వారు సంక్షోభ సమయాల్లో కూడా సంతోషంగా జీవిస్తారు.

సురక్షితంగా ఉపయోగించండి: డబ్బును భద్రంగా, దానధర్మంకోసం, పెట్టుబడి పెట్టి కోసం ఉపయోగించే వ్యక్తి ఆపద సమయంలో కూడా నవ్వుతూ జీవితాన్ని గడుపుతాడని ఆచార్య చాణక్య చెప్పారు. సరైన స్థలం, సమయానికి అనుగుణంగా డబ్బును ఉపయోగించాలి. మంచం ఉన్నంత మాత్రాన అంత దూరం కాళ్ళు చాచాల్సిన అవసరం లేదని అంటారు. అనవసరంగా డబ్బు ఖర్చు చేసేవారు విపత్తులలో కష్టాలను, పేదరికాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.

అనవసరంగా ఖర్చు చేయవద్దు: ఆచార్య చాణక్యుడు ప్రకారం.. అనవసరమైన ఖర్చులకు డబ్బుని ఖర్చు పెట్టకుండా.. డబ్బు ఆదా చేయడం ఉత్తమ మార్గం. చాణక్యుడు ప్రకారం..  డబ్బు ఎప్పుడు, ఎంత, ఎక్కడ ఖర్చు చేయాలి అనే విషయాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేసేవారు.. ఇతరుల దృష్టిలో జిజ్ఞాసువులుగా నిలుస్తారు. అయితే అలాంటి వ్యక్తులు తమ జీవితంలో ఎటువంటి దారుణ పరిస్థితులు ఎదురైనా సాధారణ జీవితాన్ని గడుపుతారు.

ఇవి కూడా చదవండి

దానం చేయండి: ఆదాయంలో కొంత భాగాన్ని దానిని ఉపయోగిస్తే ఆ వ్యక్తి సంపద రెట్టింపు అవుతుందని ఆచార్య చాణక్యుడు విశ్వాసం. దానధర్మాన్ని మించిన గొప్ప సంపద లేదు.  పేదవాడికి తన శక్తి మేరకు సహాయం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం నిలిచి ఉంటుంది.

అవసరాలను పరిమితం చేసుకోండి: సమతులాహారం మన శరీరాన్ని ఎంతకాలం ఆరోగ్యంగా ఉంచుతుందో.. అలాగే డబ్బుని ఖర్చు చేసే సమయంలో మనిషి సమాత్యుల్యం చేసుకుంటే.. ఆపద సమయంలో ఆ డబ్బులు ఆదుకుంటాయి. డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి. ఇలా చేయడం కోసం మీ అవసరాలను పరిమితం చేసుకోండి. మీకు అవసరమైనంత మాత్రమే ఖర్చు చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)