Budh Gochar: రేపు ధనుస్సు రాశిలో ప్రవేశించనున్న బుధుడు.. ఈ రాశివారికి గుడ్ లక్.. ధనలాభాలకు అవకాశం
ధనుస్సు రాశిని బృహస్పతి రాశిగా పరిగణిస్తారు. మెర్క్యురీ రాశిలో మార్పు అన్ని రాశిచక్రాలపై వివిధ ప్రభావాలను కలిగి ఉంటుంది. బుధుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడం వలన ఏ రాశివారికి ఎటువంటి ప్రయోజనాలు కలిగి ఉంటుందో తెలుసుకుందాం.
జ్యోతిషశాస్త్రంలో.. తొమ్మిది గ్రహాల్లో బుధ గ్రహాన్ని యువరాజు అంటారు. ఈ గ్రహం ఎల్లప్పుడూ ఆనందించడానికి ప్రయత్నిస్తాడు. బుధుడు ప్రసంగం, తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్ లకు కారకుడు. బుధుడు కన్యారాశిలో ఉచ్ఛస్థితిలో ఉండి మీనరాశిలో బలహీన స్థితిలో ఉంటాడు. 2023 సంవత్సరం చివరి నెలలో బుధుడు రెండు రాశుల్లో సంచరించనున్నాడు. బుధుడు రేపు (డిసెంబర్ 03న) ధనుస్సు రాశిలో సంచరిస్తాడు. ధనుస్సు రాశిని బృహస్పతి రాశిగా పరిగణిస్తారు. మెర్క్యురీ రాశిలో మార్పు అన్ని రాశిచక్రాలపై వివిధ ప్రభావాలను కలిగి ఉంటుంది. బుధుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడం వలన ఏ రాశివారికి ఎటువంటి ప్రయోజనాలు కలిగి ఉంటుందో తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి బుధుడు మార్పు శుభప్రదం: సింహ రాశి– బుధుని మార్పు సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా.. ప్రయోజనకరంగా ఉంటుంది. ధనలాభానికి మంచి అవకాశం ఉంది. ఉద్యోగస్తులు చేసే పనికి తగిన ప్రశంసలను అందుకుంటారు. మెర్క్యురీ సంచారము సింహ రాశివారు వృద్ధి అవకాశాలను పెంచుతుంది. బుధుడు రాశి మార్పు విద్యార్థులకు శుభసూచకం. శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి.
ధనుస్సు – ఈ రాశి వారికి బుధ సంచారం శుభప్రదం అవుతుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలను పొందవచ్చు. వైవాహిక జీవితాన్ని ఆనందించవచ్చు. ధనలాభానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందగలరు.
కుంభ రాశి – ఈ రాశివారు కెరీర్‌లో కష్టపడితే శుభ ఫలితాలను పొందవచ్చు. బుధ రాశి మార్పుతో.. ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. మీరు పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందే అవకాశం ఉంది. మీ అనుభవంతో మీరు ఈ నెలలో చాలా మంచిని సాధించగలరు. బుధ సంచారం విద్యార్థులకు విజయాన్ని చేకూరుస్తుంది.
ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి: మేషరాశి– బుధుడు రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఎవరితోనైనా వాగ్వాదం రావచ్చు.
వృషభ రాశి – బుధుడు రాశి మార్పు ఈ రాశి వారికి నష్టాలను కలిగిస్తుంది. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మీరు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మిథున రాశి– ఈ రాశి వారు వ్యాపారంలో నష్టాన్ని చవిచూడవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చర్చలకు దూరంగా ఉండాలి.. లేకపోతే మీరు నష్టపోవచ్చు.
కర్కాటక రాశి – ఈ రాశి వారు కోర్టు చుట్టూ తిరగాల్సి రావచ్చు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)