Dream: కలలో పాములు కనిపిస్తున్నాయా.? అయితే మీ జీవితంలో ఈ మార్పులు జరగనున్నాయి.
నిద్రలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో చాలా మందికి రకరకాల కలలు వస్తుంటాయి. అయితే మనకు వచ్చే ప్రతీ కల వెనకాల ఒక కారణం ఉంటుందని మీకు తెలుసా.? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందని చెబుతున్నారు...
నిద్రలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో చాలా మందికి రకరకాల కలలు వస్తుంటాయి. అయితే మనకు వచ్చే ప్రతీ కల వెనకాల ఒక కారణం ఉంటుందని మీకు తెలుసా.? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందని చెబుతున్నారు. భవిష్యత్తులో మన జీవితంలో జరిగే అంశాలకు రాత్రుళ్లు మనకు వచ్చే కలలకు మధ్య సంబంధం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొందరికి కలలో పాములు కనిపిస్తుంటాయి. అయితే కలలో ఇలా పాములు కనిపించడం మంచిదేనా.? లేదా అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా నిద్రలో పాములు కనిపిస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వారి జాతకంలో కాలసర్ప దోషం లేదా రాహు-కేతు దశ నడుస్తున్నట్లు అర్థం. ఇలాంటి వారికి కలలో పాములు కనిపిస్తుంటాయి. కలలో పాముల గుంపు కనిస్తే అలాంటి కల అశుభకరమైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కల వస్తే జీవితంలో కష్టాలు ఎదురుకానున్నాయని సంకేతం. ఇక కలలో మీకు కలలో నల్లటి పాము కనిపిస్తే, సంపదను కోల్పోవచ్చు లేదా మీరు అనారోగ్యంతో బాధపడవచ్చని జ్యోతిష్యం చెబుతోంది.
ఒకవేళ కలలో పామును చంపుతున్నట్లు కనిపిస్తే అలాంటి కల శుభప్రదం. మీరు మీ శత్రువుపై విజయం సాధించబోతున్నారని దీని అర్థం. మీ కలలో పాము కాటుకు గురైతే, అది చాలా అశుభం. భవిష్యత్తులో మీరు తీవ్రమైన వ్యాధులతో బాధపడవచ్చు అని అర్థం. కలలో చనిపోయిన పామును చూడటం జాతకంలో రాహు దోషంతో సంబంధం కలిగి ఉంటుంది. అలాంటి కలలను చూసిన తర్వాత, జ్యోతిష్కుని సలహా మేరకు, రాహు దోష నివారణ చర్యలు తీసుకోవాలి.
నోట్: పైన తెలిపిన వివరాలు పలు జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాల మేరకు అందించినవి మాత్రమే. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..