Treasure Hunt: ఆ ఆలయంలో లెక్కనేనంత సంపద.. ఖజానాకు పాముల కాపలా.. తెరవాలంటే గరుడ మంత్రం తెలియాల్సిందే అన్న విదేశీ రచయిత

Surya Kala

Surya Kala |

Updated on: Dec 06, 2022 | 11:54 AM

శ్రీ అనంత పద్మనాభ స్వామి విష్ణు దేవాలయంలో 7 నేలమాళిగ గదులు ఉన్నాయి. వాటిలో 6 గదులు తెరవబడ్డాయి. ఈ గదుల్లో చాలా విలువైన వస్తువులు కనుగొనబడ్డాయి. అయితే ఏడవ ద్వారం ఇంకా తెరవలేదు. తెరవడంపై నిషేధం కూడా ఉంది. treasureఈ గేటు ఎవరు తెరవగలరంటే?

Treasure Hunt: ఆ ఆలయంలో లెక్కనేనంత సంపద.. ఖజానాకు పాముల కాపలా.. తెరవాలంటే గరుడ మంత్రం తెలియాల్సిందే అన్న విదేశీ రచయిత
Mystery Behind 7th Door Of Padmanabhaswamy Temple

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. వింతలు, రహస్యాలను దాచుకున్న అనేక దేవాలయాలు ఉన్నాయి. సనాతన ధర్మ విశిష్టతను తెలుపుతూ.. కొండ కోనల్లో ఉన్న అనేక ఆలయాల్లో కొన్ని స్వయంభూ ఆలయాలు కాగా మరికొన్ని మానవ నిర్మితాలు. వీటికి సంబంధించిన రహస్యాలు ఇంకా చాలా పరిశోధనలు చేయవలసి ఉందని చెబుతాయి. ఈ రహస్యాలలో ఒకటి దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటైన కేరళలోని తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ ఆలయంలో ఒక ద్వారం ఉంది.. అది ఏడవ ద్వారం.. ఈ ద్వారం ఇంకా తెరుచుకోలేదు.. ఈ ద్వారం తెరిస్తే అందులో ఉన్న భారీ నిధి బయటపడుతుందని..  ఈ సంపద లెక్క పెట్టలేనంత ఉంటుందని చెబుతారు.

అవును.. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి నిధికి సంబంధించి అనేక రకాల కథనాలు వినిపిస్తాయి. ఈ ఆలయంలో 7వ ద్వారం వెనుక భారీ నిధి ఉంటే ఈ గేటు ఎందుకు తెరవలేదని మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవానికి.. ఈ ఏడవ ద్వారం తెరవడం సామాన్యమైన విషయం కాదు. ఇది నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే అసలు ఈ ద్వారం ఎలా మూసివేశారో మీకు తెలుసా? ఈ గేటు ప్రత్యేకత ఏమిటి?  ద్వారం తెరిస్తే.. ఎంత నిధి ఉంటుందో అంచనా వేయగలరా..?

ఈ గుడి కథ ఏమిటి? శ్రీ అనంత పద్మనాభ స్వామి విష్ణు దేవాలయం 6వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్ రాజులచే నిర్మించబడిందని 9వ శతాబ్దపు గ్రంథాలలో పేర్కొనబడింది. ఈ దేవాలయంలోనే ఈ రాజులు తమ సంపదలన్నీ దాచుకున్నారని చెబుతారు. ఇప్పుడు ఆలయ నిర్వహణ బాధ్యత రాజకుటుంబంపై ఉంది. ఈ ఆలయంలో 7 నేలమాళిగ గదులు ఉన్నాయి. వాటిలో 6 గదులు తెరవబడ్డాయి. ఈ గదుల్లో చాలా విలువైన వస్తువులు కనుగొనబడ్డాయి. అయితే ఏడవ ద్వారం ఇంకా తెరవలేదు. తెరవడంపై నిషేధం కూడా ఉంది.

అనంత పద్మనాభ స్వామి ఆలయం:  ఆలయంలోని ఏడవ ద్వారాన్ని పాములు రక్షిస్తాయి. తలుపు తెరవడానికి ఎవరినీ అనుమతించవని ఒక కథనం. భక్తుల నమ్మకాల ప్రకారం.. ఒకసారి ఒక వ్యక్తి ఏడవ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు.. తను పాము కాటుతో మరణించాడు. నిజానికి ఈ తలుపు ఉక్కుతో తయారు చేయబడింది. ఈ తలపులపై రెండు పాములు చిత్రాలు ఉంటాయి. ఈ తలుపుకు తాళం ఉండదు. అయితే ఈ ద్వారాన్ని తెరవడానికి వేరే మార్గం ఉందని అంటారు. ఈ ద్వారం తెరవాలంటే.. పాములకు సంబంధించిన మంత్రాల ద్వారా మాత్రమే సాధ్యమని నమ్ముతారు. అయితే ఈ తలుపులు తెరవడం వల్ల చాలా ప్రమాదం ఉందని భావిస్తారు.

ఈ గేటు ఎవరు తెరవగలరంటే? ఈ గేటును దైవం నియమించిన వ్యక్తి మాత్రమే తెరవగలడని.. ఇప్పటివరకు అలాంటి వ్యక్తి కనుగొనబడలేదని అంటారు. ఈ గేటు తెరుచుకోవడం వల్ల ప్రమాదం జరగదని.. అయితే ఈ ఏడవ ద్వారం తెరచుకోవడానికి అనేక అనుమతులు తీసుకోవలసి ఉంటుందని కొందరు చెబుతున్నారు. అలా అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ద్వారం తెరవడం జరుగుతుందన్నారు. చాలా మంది ఏడవ ద్వారంలోపల ఉన్న నేలమాళిగను శపించబడిన ప్రాంతం అని కూడా భావిస్తారు.

ఏడవ ద్వారం లోపల ఉన్న నేలమాళిగ: ఏడవ నేలమాళిగలో చాలా బంగారం దొరుకుతుందని చెబుతారు. ఎందుకంటే ఇంతకుముందు 6 గేట్లు తెరిచినప్పుడు.. విలువైన సంపద లభించింది.  బంగారం, వజ్రాలు వంటి విలువైన సంపద లభ్యమైంది. నివేదికల ప్రకారం, పద్మనాభ స్వామి ఆలయంలోని 6 నేలమాళిగల్లో ఇప్పటివరకు రూ.1,32,000 కోట్ల విలువైన ఆస్తి కనుగొనబడింది. వీటిలో బంగారు విగ్రహాలు, వజ్రాలు, నగలు మొదలైనవి ఉన్నాయి. అయితే ఏడవ ద్వారం తర్వాత ఉన్న నేలమాళిగలో చాలా బంగారం విలువైన సంపద ఉందని.. అది దేశ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుందని పలువురు చరిత్రకారులు ఊహిస్తున్నారు.  ఈ నేలమాళిగ  నిధి మొత్తం విలువ 1 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ తలపులు తెరవడానికి ఓ వ్యక్తి రావాల్సి ఉందని.. వచ్చేవరకూ ఎదురుచూడాల్సిదే అని అంటున్నారు.

గరుడ మంత్రం

రహస్య ఖజానా తలుపు ‘గరుడ మంత్రం’ జపించే జ్ఞానం తెలిసిన ఉన్నత స్థాయి ‘సాధు’ల ద్వారా మాత్రమే తెరవబడుతుంది. ఎవరూ మరే విధంగానూ తలుపులు తెరవలేరు. అయితే ప్రస్తుతం ఇంతటి శక్తివంతమైన ‘సిద్ధపుర్షలు’ ప్రపంచంలో ఎవరూ లేరని చెబుతున్నారు

ట్రావెన్‌కోర్: ఎ గైడ్‌బుక్ ఫర్ ది విజిటర్

ఎమిలీ గిల్‌క్రిస్ట్ హాచ్ రచించిన ‘ట్రావెన్‌కోర్: ఎ గైడ్‌బుక్ ఫర్ ది విజిటర్’ అనే పుస్తకం 1931లో వాల్ట్‌లను తెరవడానికి ప్రయత్నించిన వ్యక్తుల బృందాన్ని గుర్తుచేసుకుంది. నాగుపాములతో నిండిన ఈ తలపులు తెరవడానికి వెళ్ళినప్పుడు పాముల దాడితో అక్కడ నుంచి ప్రాణాల కోసం పారిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 1908లో అదే విధంగా చేసిన ప్రయత్నం విఫలమైందని ఎ గైడ్‌బుక్ ఫర్ ది విజిటర్ పుస్తకంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu