Vastu Tips For Marriage: దంపతులు తరచుగా గొడవలు పడుతున్నారా.. ఈ వాస్తు చిట్కాలను పాటించి చూడండి..

వాస్తు శాస్త్రాన్ని సరిగ్గా అమలు చేసినప్పుడు.. మీ సంబంధాన్నీ మెరుగు పరుస్తాయి. వైవాహిక సంబంధాల విషయంలోనూ అంతే. ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ప్రదేశంలో శక్తి సమతుల్యత కారణంగా ఇది జరుగుతుంది. వైవాహిక సంబంధాన్ని పునరుద్ధరించడానికి సహాయపడే కొన్ని వాస్తు చిట్కాల గురించి ఈరోజు తెలుసుకుందాం

Vastu Tips For Marriage: దంపతులు తరచుగా గొడవలు పడుతున్నారా.. ఈ వాస్తు చిట్కాలను పాటించి చూడండి..
Marriage
Follow us
Surya Kala

|

Updated on: Dec 06, 2022 | 1:55 PM

ఇంటిలోకి వ్యక్తుల సంబంధాలు, శక్తి, సంపద, శ్రేయస్సు పై ఆ ఇంటి వాస్తు ప్రభావం చూపిస్తుందని నమ్మకం. ఇదే విషయాన్ని వాస్తు శాస్త్రం కూడా పేర్కొంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు సానుకూల శక్తిని ఆకర్షించే స్థలాన్ని ఏర్పరచుకోవచ్చు. ఇది మీ జీవితంలో స్థిరత్వం, సానుకూలతను ఏర్పాటు చేస్తుంది. ఈ సానుకూల శక్తి ఇంట్లోని వ్యక్తుల సంబంధాలను పెంపొందించడానికి, అనుకూలతను మెరుగుపరచడానికి  సహాయపడుతుంది. కొంతమంది ఈ విషయాన్నీ గ్రహించలేరు కానీ మీ ఇంట్లో, పరిసరాలలోని శక్తి మీ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అవి మిమ్మల్ని సంతోషంగా లేదా విచారంగా ఉంచుతాయి. అదృష్టం లేదా దురదృష్టం వంటి ఇతర విషయాలను తెస్తాయి. అయితే వాస్తు శాస్త్రాన్ని సరిగ్గా అమలు చేసినప్పుడు.. మీ సంబంధాన్నీ మెరుగు పరుస్తాయి. వైవాహిక సంబంధాల విషయంలోనూ అంతే. ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ప్రదేశంలో శక్తి సమతుల్యత కారణంగా ఇది జరుగుతుంది. వైవాహిక సంబంధాన్ని పునరుద్ధరించడానికి సహాయపడే కొన్ని వాస్తు చిట్కాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

  1. ఈశాన్య దిశలో నీలం లేదా ఊదా రంగుతో ఉండాలి. అంతేకాదు ఈశాన్య దిశా ఎప్పుడూ తేలికగా ఉండాలి. ఈ చర్యలు భాగస్వాముల మధ్య ఆలోచనల్లో  స్పష్టతను తీసుకురావడానికి సహాయపడతాయి.
  2. పిల్లల లేదా అతిథి పడకగదిలో వీచే చల్లని గాలి భాగస్వాముల మధ్య సమన్వయం , సామరస్యాన్ని మెరుగుపరుస్తుంది. సానుకూల ప్రభావం మెరుగుపడడానికి ఈ గదులలో బూడిద లేదా ముదురు నీలం రంగును కూడా ఉపయోగించవచ్చు.
  3. భార్యాభర్తల పడకగదిలో మెటల్ బెడ్‌లను ఉపయోగించడం మానుకోండి. ఇది మీ నిద్రకు భంగం కలిగించవచ్చు. అంతేకాదు భాగస్వాముల మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తుంది. అంతేకాదు.. మాస్టర్ బెడ్ రూమ్ లో ఒక మంచం, ఒక పరుపు మాత్రమే ఉండాలి. రెండు మంచాలు ఒకదానితో ఒకటి జతకలిపిన రెండు దుప్పట్లు కలిపి వేసుకోవడం భార్యాభర్తల బంధంపై ప్రభావం చూపిస్తుంది.
  4. మాస్టర్ బెడ్‌రూమ్ నైరుతి దిశలో ఉండేలా చూసుకోండి. ఇది భాగస్వాముల మధ్య మంచి కెమిస్ట్రీని నెలకొల్పడానికి సహాయపడుతుంది. అలాగే, నిర్ణయం తీసుకునే ప్రక్రియలో మరింత స్థిరత్వం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. పడకగదిలోని అడ్డం పెట్టుకోవడం మానుకోండి. లేదా బెడ్ రూమ్ లో అద్దం ఉంటె దానిని తెరతో కప్పి ఉంచండి. ముఖ్యంగా మంచానికి నేరుగా ఎదురుగా ఉండే అద్దానికి దూరంగా ఉండాలి. ఇది ఆరోగ్య సమస్యలు, మగతనం,  శక్తి లోపానికి కారణమవుతుంది.
  7. నిద్ర లేచిన వెంటనే మొదటగా అద్దం చూసుకునే అలవాటు ఉంటే వెంటనే ఈ అలవాటుని మానుకోండి. అలాగే, మీ పడకగదిలో చిన్న అద్దాలను ఉంచడానికి ప్రయత్నించండి. పెద్ద అద్దాలు వైవాహిక సంబంధంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.
  8. గది మూల.. ముఖ్యంగా ఈశాన్య మూల చిందరవందరగా లేకుండా చూసుకోవాలి. ఉత్తర దిశలో తెలుపు పువ్వులు , నైరుతి దిశలో ఎరుపు లేదా ఊదా గులాబీలతో ఇండోర్ మొక్కలను ఏర్పాటు చేసుకోండి. ఇవి మీ గదికి మరింత అందాన్ని తెస్తాయి. అంతేకాదు మీ సంబంధాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!