AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vrishabh Rashi: వృషభ రాశి వారికి 2023 ఏడాది ఎలా ఉంటుంది.. ఉద్యోగం, వృత్తి, ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోండి

వృషభ రాశి వారికి 2023 సంవత్సరం చాలా శుభప్రదమైనది. విజయవంతమైనది. 2023 సంవత్సరంలో శని, బృహస్పతి ఇద్దరూ తమ రాశి గమనాన్ని మార్చుకుంటారు. అంతేకాదు అక్టోబర్‌లో రాహు-కేతువులు కూడా రాశి గమనాన్ని మార్చుకుంటారు.

Vrishabh Rashi: వృషభ రాశి వారికి 2023 ఏడాది ఎలా ఉంటుంది.. ఉద్యోగం, వృత్తి, ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోండి
Taurus Horoscope 2023
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 12, 2022 | 3:16 PM

Share

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టనున్నాం.. ఈ నేపథ్యంలో ఈ రోజు 2023 ఏడాదిలో వృషభ రాశి వారికి ఎలా జరుగుతుందో.. శుభ, అశుభాల గురించి తెలుసుకుందాం.. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు శుభ  గ్రహంగా ఖ్యాతిగాంచాడు.  వృషభ రాశి వారికి 2023 సంవత్సరం చాలా శుభప్రదమైనది. విజయవంతమైనది. 2023 సంవత్సరంలో శని, బృహస్పతి ఇద్దరూ తమ రాశి గమనాన్ని మార్చుకుంటారు. అంతేకాదు అక్టోబర్‌లో రాహు-కేతువులు కూడా రాశి గమనాన్ని మార్చుకుంటారు. మొత్తంమీద, ఈ సంవత్సరం వృషభరాశివారికి అన్ని రంగంలో విజయం, సంపద, ఆనందం, శ్రేయస్సు. కీర్తిని తెస్తుంది.

వృషభ రాశి వారికి 2023 లో కెరీర్ ఈ రాశిలో పదవ ఇంట్లో, శని దేవుడు సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరిలో కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దానివల్ల వచ్చే కొత్త సంవత్సరం కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. మీరు ఏ పనిలోనైనా మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మంచి, విజయవంతమైన సంవత్సరంగా నిలుస్తుంది. శనీశ్వరుడు, తో పాటు దేవతల గురువు బృహస్పతి ఏప్రిల్‌లో ఈ రాశిలో 11 వ ఇంట్లో ఉంటారు. జ్యోతిషశాస్త్రంలో, బృహస్పతి గ్రహం జ్ఞానం, తెలివితేటలకు కారకం. ఈ సంవత్సరం ఈ రాశివారు  మంచి డబ్బు సంపాదిస్తారు. అంతేకాదు కెరీర్‌లో ఘన విజయాలను సాధించే అవకాశం ఉంది. మీ కెరీర్‌లో దైర్యంగా ముందుకు అడుగు వేసి ప్రయోజనం పొందుతారు. మరోవైపు, ఏప్రిల్ తర్వాత బృహస్పతి మేషరాశిలో అడుగు పెట్టడం.. రాహువుతో మైత్రి కారణంగా.. ఈ రాశివారు విదేశాలకు పయనం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు   విజయవంత అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు చాలా సంవత్సరం.

వృషభ రాశి వారికీ 2023 లో ఆర్థిక స్థితి ఆర్థికంగా, సంవత్సరంలో మొదటి కొన్ని నెలలు మీకు గొప్పగా ఉంటాయి.  ఈ రాశివారికి శుభం కలుగుతుంది. కుంభరాశిలో 30 సంవత్సరాల తర్వాత శనిశ్వరుడు సొంత రాశిలోకి అడుగు పెట్టనున్నాడు ఇది ఈ రాశివారికి ఒక వరం అని చెప్పవచ్చు. డబ్బు కోసం మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈ ఏడాది  లాభదాయకమైన పరిస్థితిలు నెలకొంటున్నాయి. బృహస్పతి రాశి మారడం వల్ల ఈ రాశివారు విదేశాల నుండి కూడా ఆకస్మిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి వారికీ  2023 లో కుటుంబ పరిస్థితులు కుటుంబ పరంగా చూస్తే వృషభ రాశి వారికి 2023 సంవత్సరం మిశ్రమ సంవత్సరంగా ఉంటుంది. మీరు సంవత్సరం ప్రారంభ నెలల్లో కొంత ఒత్తిడిని ఏర్పడవచ్చు. అయితే ఈ ఒత్తిడి ఎక్కువ కాలం ఉండదు. ఏప్రిల్ తర్వాత, మీ నాల్గవ ఇంట్లో బృహస్పతి ఈ సంచారం తర్వాత, కుటుంబంలో శాంతి నెలకొల్పడం వల్ల కుటుంబ ఉద్రిక్తతలు తగ్గుతాయి.

వృషభ రాశి వారికీ  2023 లో విద్య వృషభ రాశి వారికి విద్య, పరీక్షలు, పోటీ పరంగా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. 2023 సంవత్సరం ప్రారంభంలో, శని ఏడవ అంశం ఐదవ ఇంట్లో ఉంటుంది. ఏప్రిల్‌లో బృహస్పతి రాశి మారడం వల్ల విదేశాల్లో విద్యాభ్యాసం విషయంలో బాగుంటుంది.

వృషభ రాశి వారికీ  2023 లో ఆరోగ్యం 2023 సంవత్సరం ప్రారంభ నెలల్లో ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు శని అష్టమ కోణంలో ఉండడం వలన  ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)