Horoscope Today: ఈ రోజు ఈ రాశి వ్యాపారస్తులు లాభాలు పొందే అవకాశం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

రోజులో తమకు జరిగే మంచి, చెడుల గురించి తెలుసుకుని అందుకు అనుగుణంగా తాము నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఈ నేపథ్యంలో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు.

Horoscope Today: ఈ రోజు ఈ రాశి వ్యాపారస్తులు లాభాలు పొందే అవకాశం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope 2023
Follow us
Surya Kala

|

Updated on: Dec 09, 2022 | 6:30 AM

Horoscope Today (09-12-2022): రోజు మొదలైతే మనిషి ముందుగా ఆలోచించేది.. ఈ రోజు తమకు ఎలా ఉంటుందనే విషయం.. దీంతో రోజులో తమకు జరిగే మంచి, చెడుల గురించి తెలుసుకుని అందుకు అనుగుణంగా తాము నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఈ నేపథ్యంలో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈరోజు (డిసెంబర్ 9వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ  రోజు ఈ రాశివారు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. వివాదాలకు దూరంగా ఉండడం మేలు. ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను తగ్గించుకునేలా చర్యలు తీసుకోవడం మేలు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా ఇబ్బంది పడే సంఘటన చోటు చేసుకుంటుంది. చేపట్టిన  పనులను పుర్తి చేయడంలో ఇబ్బంది పడతారు. బంధు, మిత్రులతో వివాదం నెలకొనే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి శుభకాలం. కుటుంబ సభ్యుల సహకారం ఉంది. పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది.  అవసరానికి సహాయం అందుకుంటారు. ముఖ్యమైన పనుల విషయంలో ఓర్పుగా వ్యవహరించండి.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా సక్సెస్ అందుకుంటారు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. కీలకనిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కీలక సమయాల్లో తగిన నిర్ణయాలను తీసుకుంటారు.  వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఇష్టమైనవారితో  గడుపుతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  పనుల విషయంలో కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి.  బంధు, మిత్రముల సహకారంతో ముందుకు వెళ్లారు. ఉత్సాహంగా పనిచేస్తారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ప్రయాణల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక శ్రమ పడతారు. ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లి.. మంచి ఫలితాలు అందుకుంటారు. శ్రమ అధికం అవుతుంది. .

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కీలక వ్యవహారాల్లో బాధ కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అధిక పడాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి ఆర్ధిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. సంతోషంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. విజయావకాశాలు మెరుగవుతాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.  మానసికంగా సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో విజయాలను సొంతం చేసుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. అనవసర ధన వ్యయం చేస్తారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వాదం పొందుతారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ఇతరుల సహకారంతో ప్రారంభించిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. నిర్లక్ష్యాని వీడి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పట్టుదలతో విజయం సాధిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే