AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope 2023: కొత్త ఏడాదిలో మిథున రాశివారిపై శని శుభ దృష్టి.. ఈ రాశివారి ఉద్యోగం, వృత్తి , ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోండి

2023వ సంవత్సరంలో మిథునరాశి వారి కెరీర్‌లో ఉన్నత స్థానంలో ఉంటుంది. కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశివారు  ఆర్థిక స్థితి పెరుగుదలను చూస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ , మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

Horoscope 2023: కొత్త ఏడాదిలో మిథున రాశివారిపై శని శుభ దృష్టి.. ఈ రాశివారి ఉద్యోగం, వృత్తి , ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోండి
Mithun Rashi Phalalu 2023
Surya Kala
|

Updated on: Dec 29, 2022 | 3:03 PM

Share

2023 సంవత్సరం మిథున రాశి వారికి చాలా లాభదాయకంగా ఉండనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికీ శనీశ్వరుడి నుండి విముక్తి లభిస్తుంది. అనంతరం ఈ రాశివారు చేపట్టిన ప్రతి పనిలో మంచి విజయం సాధిస్తారు. శని సుమారు రెండున్నర సంవత్సరాల తర్వాత . 2023 సంవత్సరం ప్రారంభంలో..తన రాశి గమనాన్ని మార్చుకోనున్నాడు. జనవరి 17, 2023న శనీశ్వరుడు తన రెండవ రాశిలోకి ప్రవేశిస్తాడు. 2023లో ఏప్రిల్‌లో బృహస్పతి కూడా మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అంతేకాదు రాహు-కేతువులు అక్టోబర్‌లో రాశి గమనాన్ని మార్చుకుంటాడు. ఈ కారణాలతో ఈ రాశివారు లాభంపై ప్రభావం పడనుంది.

మిథున రాశి జాతకం 2023లో కెరీర్ 2023వ సంవత్సరంలో మిథునరాశి వారి కెరీర్‌లో ఉన్నత స్థానంలో ఉంటుంది. కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశివారు  ఆర్థిక స్థితి పెరుగుదలను చూస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ , మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీ తొమ్మిదవ ఇంట్లో శని సంచారం వల్ల మీకు శుభం కలుగుతుంది. ఈ ఏడాదిలో అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు సంవత్సరం ప్రారంభ నెలల్లో కొత్త ఉద్యోగం పొందవచ్చు. సంవత్సరం మధ్యలో.. మీరు మీ సీనియర్లతో కూడా విబేధాన్ని కలిగి ఉండవచ్చు. మీపై మరింత పని ఒత్తిడి ఉండవచ్చు. మరోవైపు ఈ రాశి వ్యాపారస్తులు కొత్త సంవత్సరంలో భారీ లాభాలను పొందవచ్చు. మీ కొత్త వ్యాపార ప్రణాళికలు ఈ సంవత్సరం ఫలవంతం అవుతాయి. మీరు వ్యాపారంలో పెద్ద ఆర్డర్ కూడా పొందవచ్చు. దీని కారణంగా ఈ సంవత్సరం మీ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది.

మిథున రాశి జాతకం 2023లో ఆర్థిక స్థితి ఈ రాశివారికి శనిశ్వరుడు ఈ ఏడాది అదృష్టాన్ని తీసుకుని రానున్నాడు. శనీశ్వరుడి శుభ దృష్టితో ఈ రాశివారు చేపట్టిందల్లా బంగారం..  అలాగే మీరు డబ్బు సంపాదించడానికి అనేక బంగారు అవకాశాలను పొందుతారు. ఈ సంవత్సరం ఈ రాశివారు ఖచ్చితంగా సాధిస్తారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. మీరు 2023 సంవత్సరంలో అన్ని రకాల ఆశించిన ఫలితాలను పొందుతారు. ఏడాది పొడవునా ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. ఈ సంవత్సరం దేవగురువు బృహస్పతి ఈ రాశివారులో పదవ ఇంటిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో ఈ రాశి వ్యక్తులకు డబ్బు , అదృష్టం రెండింటిలోనూ మంచి విజయాన్ని పొందుతారు. మొత్తంమీద ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆర్థిక విజయాలతో నిండి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథున రాశి జాతకం 2023లో కుటుంబ జీవితం 2023 సంవత్సరంలో ఈ రాశి కుటుంబం సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, గౌరవం ఉంటుంది. కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది. ఈ సంవత్సరం సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వీరికి మంచి అవకాశం లభిస్తుంది. మీరు ఈ సంవత్సరం మతపరమైన యాత్రలను చేసే అవకాశం ఉంది. సంవత్సరం మధ్యలో..  కొన్ని శుభకార్యాలు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఈ రాశివారికి గొప్ప కార్యక్రమం ఉండవచ్చు. పిల్లల చదువులకు సంబంధించిన ఆందోళనలు ఈ సంవత్సరం తీరతాయి. పిల్లల ఉన్నత విద్యలో ప్రవేశం పొందాలనే కల సాకారం అవుతుంది.

మిథున రాశి జాతకం 2023లో విద్య విద్యార్థులు, పోటీ పరీక్షల పరంగా ఈ ఏడాది మిశ్రమ సంవత్సరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ తర్వాత విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే సూచనలున్నాయి. బృహస్పతి మీనరాశి నుండి మేషరాశిలోకి సంచరించినప్పుడు విద్యలో కొన్ని ఆటంకాలు తొలగిపోయి ఒత్తిడి కూడా తగ్గుతుంది. సంవత్సరాంతంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కష్టపడి పరీక్షకు సిద్ధమైన విద్యార్థులకు మంచి విజయావకాశాలు ఉన్నాయి.

మిథున రాశి జాతకం 2023లో ఆరోగ్యం ఈ సంవత్సరం ఏలిన నాటి శని నుంచి బయటపడతారు. అప్పుడు శని జనవరి 17న మీ తొమ్మిదో ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటి నుంచో బాధపడుతున్న వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా సంవత్సరం పొడవునా ఈ రాశివారు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)