AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gorakhpur: తల్లి మృతదేహాన్ని ఐదురోజులుగా ఇంట్లోనే దాచిపెట్టిన కొడుకు.. అగరబత్తులు వెలిగిస్తూ..

15 రోజుల క్రితం భార్యతో గొడవ పడగా, ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. నిఖిల్‌కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు ఢిల్లీలో నివసిస్తున్నారు. నిఖిల్ తన 82 ఏళ్ల తల్లితో కలిసి ఇదే ఇంట్లో ఉంటున్నాడు.

Gorakhpur: తల్లి మృతదేహాన్ని ఐదురోజులుగా ఇంట్లోనే దాచిపెట్టిన కొడుకు.. అగరబత్తులు వెలిగిస్తూ..
mothers dead body
Jyothi Gadda
|

Updated on: Dec 14, 2022 | 5:25 PM

Share

ఇది మరోదారుణం.. ఈ వార్త విన్న ఎవరికైనా ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా..? అనే సందేహం కలుగమానదు. తల్లి మృతదేహాన్ని ఓ కొడుకు తన ఇంట్లో 5 రోజుల పాటు దాచి ఉంచాడు. ఇంట్లోంచి దుర్వాసన వెదజల్లటంతో ఇరుగుపోరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ గుల్రిహా ప్రాంతంలో చోటు చేసుకుంది. 45 ఏళ్ల కుమారుడు తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఐదు రోజుల పాటు దాచి ఉంచాడు. మృతదేహం నుండి వాసన రాగానే అగరబత్తీలు వెలిగించేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ముందుగా మార్చురీకి తరలించారు. పంచనామా నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించారు.

శివపూర్‌లోని షాబాజ్‌గంజ్ ప్రాంతంలోని ఇంట్లో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. 82 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శాంతిదేవి మృతి చెందినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ అవస్తీ తెలిపారు. శాంతిదేవి ఐదు రోజుల క్రితమే మరణించినట్టుగా నిర్ధారించారు. కుమారుడు నిఖిల్ మిశ్రా మద్యానికి బానిసై మానసిక వికలాంగుడు. అసలు ఇంట్లో ఏం జరిగిందో చెప్పలేకపోయాడు అని ఏఎస్పీ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

గుల్రిహా ప్రాంతంలోని శివపూర్ షాబాజ్‌గంజ్‌లో నివసిస్తున్న రామ్ దులారే మిశ్రా ఖుషీనగర్‌లోని బోదర్వార్‌లో ఉన్న ఇంటర్ కాలేజీలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. రామ్ దులారే భార్య శాంతి దేవి, కుమారుడు నిఖిల్ మిశ్రాతో కలిసి శివపూర్ సహబజ్‌గంజ్‌లో నివసించారు. అతను 10 సంవత్సరాల క్రితం మరణించాడు. కాగా, కుమారుడు నిఖిల్ తన తల్లి శాంతి దేవి, అతని భార్య పిల్లలతో నివసించాడు. అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, మద్యం తాగే అలవాటు కూడా ఉందని స్థానికులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే, 15 రోజుల క్రితం భార్యతో గొడవ పడగా, ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. నిఖిల్‌కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు ఢిల్లీలో నివసిస్తున్నారు. నిఖిల్ తన 82 ఏళ్ల తల్లితో కలిసి ఇదే ఇంట్లో ఉంటున్నాడు. తల్లి శాంతి దేవి గోరఖ్‌పూర్ ప్రభుత్వ ఇంటర్ కళాశాల (AD) నుండి ప్రిన్సిపాల్ పదవి నుండి పదవీ విరమణ పొందారు. ఐదు రోజుల క్రితం తల్లి చనిపోవడంతో చుట్టుపక్కల వారికి చెప్పకుండా, దహన సంస్కారాలు నిర్వహించకపోగా.. మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టినందుకు కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి