AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: దేశ రాజధానిలో ఎగిరిన గులాబీ జెండా.. కిసాన్ సెల్ ఏర్పాటు.. అధ్యక్షుడు ఎవరంటే..?

తొలి అడుగు ఘనంగానే పడింది.! ఢిల్లీలో గులాబీ జెండా రెపరెపలాడింది. సరిగ్గా ముహూర్తం సమయానికి BRS జెండాను ఎగరేసి ..పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు KCR. మరి నెక్ట్స్ ఏంటి? BRS ప్లాన్‌, ప్లానింగ్ ఎలా ఉండబోతోంది?

BRS: దేశ రాజధానిలో ఎగిరిన గులాబీ జెండా.. కిసాన్ సెల్ ఏర్పాటు.. అధ్యక్షుడు ఎవరంటే..?
KCR Handed Over The Responsibilities Of Brs Party Kisan Cell To Farmer leader Gurnam Singh Chaduni
Ram Naramaneni
|

Updated on: Dec 14, 2022 | 8:45 PM

Share

ఢిల్లీలో గులాబీ జెండా ఎగరేసిన తొలిరోజే పని మొదలు పెట్టింది BRS. అబ్‌ కీ బార్ కిసాన్ సర్కారే తమ నినాదమని ప్రకటించిన KCR.. తొలి నిర్ణయం కూడా రైతులకు సంబంధించే తీసుకున్నారు. కిసాన్‌ సెల్‌ను నియమించారు. అధ్యక్షుడిగా హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన జాతీయ రైతు సంఘం నేత గుర్నాం సింగ్ ని నియమించారు. జాతీయ అధ్యక్షుని హోదాలో ఈ నియామక పత్రాలపై తొలి సంతకం చేశారు KCR. గుర్నాం సింగ్ ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్‌ను నియమించారు.

మధ్యాహ్నం 12 గంటలకు SPరోడ్డులో పార్టీ ఆఫీస్‌కు వచ్చారు కేసీఆర్. రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం 12 గంటల 37 నిమిషాలకు పార్టీ జెండాను ఆవిష్కరించారు. తర్వాత జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించి… మొదటి అంతస్తులో తనకు కేటాయించిన ఛాంబర్లో కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్నాటక మాజీ CM కుమారస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఈ ఇద్దరూ KCR వెంటే ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి రైతు సంఘం నాయకులు కూడా వచ్చారు.

ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరడం పక్కా. CM కేసీఆర్ ప్రధాని కావడం ఖాయం అంటున్నారు BRS మంత్రులు.  BRS ఏర్పాటుపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించాయి. బీజేపీని ఎదుర్కోలేక ఢిల్లీ పారిపోయారని విమర్శించారు బండి సంజయ్. విపక్షాల విమర్శల సంగతిపక్కన పెడితే BRS శ్రేణుల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. ఢిల్లీలోనే ఉన్న KCR పార్టీ విస్తరణ, వివిధ కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం