AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mouth Health: వేధించే నోటి దుర్వాసనకు హెల్తీ టిప్స్.. వీటిని ఫాలో అయితే ఆ సమస్యలకు బహు పరాక్..

నోరు మంచిదైతే.. ఊరు మంచిది అనేది సామెత. కానీ ఇప్పుడు దానిని మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. ఇప్పుడు నోరు బాగుంటే.. ఆరోగ్యం బాగుంటుంది అని అనాలి. ఎందుకంటే.. మనం తీసుకునే ఆహారం నోటి ద్వారా శరీరానికి అందుతుంది. అలాంటప్పుడు నోరు శుభ్రంగా లేకపోతే అనేక రకాల సమస్యలకు వెల్ కమ్ చెప్పినట్లే..

Ganesh Mudavath
|

Updated on: Dec 16, 2022 | 12:28 PM

Share
నోటి దుర్వాసన సమస్య ఉన్న వారు కొన్ని రకాల జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. నోటి దుర్వాసన వస్తుండడంతో మనలోని ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నలుగురుతో మాట్లాడటానికి చాలా వరకు ఇష్టపడక, అవాయిడ్ చేస్తూ ఉంటాం. దానికి తోడు పక్కవారు కూడా మనతో మాట్లాడేందుకు సాహసించరు

1 / 5
బ్రష్‌ చేయడానికి ఇంటి పేస్ట్‌నే వినియోగించడం మేలు. ఎంతో సులువుగా పేస్ట్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి, పసుపు, కాస్త ఉప్పు, అందులో నువ్వుల నూనె వేసి పేస్టులా చేసుకుని దీనితో పళ్లను తోమాలి. తద్వారా పంటి సమస్యలు తీరడంతో పాటు నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది

2 / 5
నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు ఎక్కువగా మౌత్ వాష్‌లు, చూయింగ్ గమ్‌లపై ఆధారపడుతుంటారు. అయితే సహజమైన పద్ధతుల్లో కూడా నోటి దుర్వాసనను నివారించుకోవచ్చు. ముఖ్యంగా నోటి దుర్వాసన పంటి సమస్యల వల్ల వస్తుంటుంది. వీలైనంత వరకు మన నోటిని పళ్లను శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.

3 / 5
ప్రతి రోజు ఉదయం బ్రష్ చేసిన తరువాత తప్పనిసరిగా ఉప్పు నీటితో నోటిని పుక్కిలించుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కళ్లుప్పు వేసుకుని కలిపి.. దానిని రోజులో రెండు మూడు సార్లైనా పుక్కిలించాలి. అది కూడా ఆహారం తీసుకున్న తరువాత ఇలా చేయడం వల్ల నోట్లో ఏదైనా ఆహారం మిగిలిపోయి ఉంటే నోరు శుభ్రం అవుతుంది. అంతేకాదు నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది

4 / 5
ఔషధగుణాలున్న నిమ్మరసంతో బ్రష్‌ చేయడం వల్ల దుర్వాసన సులభంగా తగ్గించుకోవచ్చు. రోజులో రెండు సార్లు బ్రష్‌ చేయడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. దానికి తోడు టూత్‌ బ్రష్‌లను రెండు మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. నోట్లోని చెడు వాసనకు కారణమైన బ్యాక్టీరియాను తరిమేందుకు సహజసిద్ధమైన మౌత్‌ వాష్‌లను వినియోగించాలి

5 / 5