Stomach Cancer: రుచి కోసం ఉప్పు అధికంగా తింటున్నారా? బీ కేర్ ఫుల్! క్యాన్సర్ మహమ్మారి పొంచి ఉంది..

నిజమండీ.. ఉప్పు అధికంగా తీసుకుంటూ పండ్లు, కూరగాయలు తక్కువగా తినే వారికి గ్యాస్ట్రిక్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Stomach Cancer: రుచి కోసం ఉప్పు అధికంగా తింటున్నారా? బీ కేర్ ఫుల్! క్యాన్సర్ మహమ్మారి పొంచి ఉంది..
Stomach Cancer
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 16, 2022 | 4:56 PM

మీరు ఉప్పు ఎక్కువగా తింటారా? సాధారణంగా పండ్లు, విజిటబుల్స్ తినడానికి ఇష్టపడరా? అయితే మీ కడుపు ప్రమాదంలో పడినట్లే! క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతున్నట్టే! నిజమండీ.. ఉప్పు అధికంగా తీసుకుంటూ పండ్లు, కూరగాయలు తక్కువగా తినే వారికి గ్యాస్ట్రిక్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అసలు ఏంటి గ్యాస్ట్రిక్ కేన్సర్, అది మన శరీరంలో ఉన్నట్లు ఎలా గుర్తించాలి? ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ మహమ్మారి బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు తెలుసుకుందాం!

వేగంగా విస్తరిస్తోంది..

కడుపు క్యాన్సర్ లేదా గ్యాస్ట్రిక్ కేన్సర్ మన దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు. ఇది సాధారణంగా కడుపులోని కణాల్లోని డీఎన్ఏలో మార్పుల కారణంగా వస్తుంది.

ప్రధాన లక్షణాలు..

– ఆహారం మింగేటప్పుడు ఇబ్బందులు పడటం – కొంచెం తినగానే కడుపు నిండిపోయిన అనుభవం కల్గడం – ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం – పొత్తి కడుపు నొప్పి – గుండెల్లో మంట – అజీర్ణం – ఆకలి మందగించడం – బరువు తగ్గడం – వాంతులయ్యేటప్పుడు రక్తం పడటం లేదా నలుపు రంగు పదార్థం కనిపించడం – మలం నలుపు రంగులోకి మారడం

ఇవి కూడా చదవండి

ప్రధాన కారణాలు..

– హైపర్ ఎసిడిటీ, గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ అనే వ్యాధి సోకడం – హెలికోబాక్టర్ పైలోరీ బాక్టీరియాతో ఇన్ఫెక్షన్ రావడం – అధిక మొత్తంలో పొగబెట్టిన.. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం – ధూమపానం – తక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం – కుటుంబంలో ఎవరికైనా లించ్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చి ఉంటటం.

ఏవి తినాలి.. ఏవి తినకూడదు..

కొన్ని రకాల ఆహార పదార్థాలు ఈ తరహా క్యాన్సర్ ను అధికం చేస్తాయి.. మరికొన్ని ఆహారం పదార్థాలు దాని ప్రభావాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సీ, విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఈ కడుపు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్, అమెరికా ఇన్ స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ తెలిపింది. అలాగే అధిక ఉప్పుతో కూడిన ఆహార పదార్థాలు అత్యంత ప్రమాదకరం కాగలవని హెచ్చరించింది.

ఇవి తింటే చాలు..

– అవకాడో, బొప్పాయి, గుమ్మడికాయ, బత్తాయి, మొక్కజొన్న, గుడ్డు, బచ్చలికూర వంటి వాటిల్లో కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడతాయి.

– నారింజ, మిరియాలు, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, బంగాళదుంపలు, బెల్ పెప్పర్స్, టమోటాలు, మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది.

– విటమిన్ సీ అనేది సిట్రస్ పండ్లు, బెర్రీలలో సాధారణంగా కనిపించే యాంటీఆక్సిడెంట్స్, కెరోటనాయిడ్స్ క్యాన్సర్ ను నిరోధిస్తాయి.

ఇలాంటి మరిన్ని వార్తల కోసం..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్