Special Winter Tea: కూల్ కూల్ వింటర్ లో హాట్ హాట్ గా టీ! ఈ కొత్త రకం టీ ని టేస్ట్ చేయకపోతే చాలా మిస్ అవుతారు !

అయితే ప్రతి సారి ఒకేరకమైన టీ తాగితే ఏం బాగుంటుంది. అనే వారు చాలా మంది ఉంటారు. రకరకాల రుచులను వారి నాలుక కోరుకుంటూ ఉంటుంది. అటువంటి వారి కోసం..

Special Winter Tea: కూల్ కూల్ వింటర్ లో హాట్ హాట్ గా టీ! ఈ కొత్త రకం టీ ని టేస్ట్ చేయకపోతే చాలా మిస్ అవుతారు !
Cinnamon Tea
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 16, 2022 | 1:04 PM

కూల్ కూల్ వింటర్ లో హాట్ హాట్ గా ఏదైనా తాగాలి అని ఎవరైనా భావిస్తారు. అందుకు టీ ని ఎక్కువగా ఎంచుకుంటారు. గిలిగింతలు పెట్టే చలిలో.. వేడివేడిగా ఉన్న టీని ఒక్కో సిప్ చేస్తూ ఉంటే ఆ మాజానే వేరు. అయితే ప్రతి సారి ఒకేరకమైన టీ తాగితే ఏం బాగుంటుంది. అనే వారు చాలా మంది ఉంటారు. రకరకాల రుచులను వారి నాలుక కోరుకుంటూ ఉంటుంది. అటువంటి వారి కోసం ఓ ప్రత్యేకమైన టీని ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో పోస్ట్ చేశారు. దానిపేరు హట్ కే ఆపిల్.  దాల్చిన చెక్కతో కూడిన టీ. దీని తయారీ కోసం కేవలం పది నిమిషాలు కేటాయిస్తే చాలని ఆయన వివరించారు. ఒక ఐదు నిమిషాలు టీకి కావాల్సిన పదార్థాలు సమకూర్చుకోవడానికి, మరో ఐదు నిమిషాలు టీని రెడీ చేయడానికి సరిపోతాయని అని ఆయన చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..

స్పెషల్ టీకి కావాల్సిన పదార్థాలు..

పుదీనా రెమ్మలు: 4 నారింజ: సగం పండు ఆపిల్ ముక్క: 1 అల్లం ముక్క: 2 గ్రీన్ టీ బ్యాగ్: 2 దాల్చిన చెక్క: 2 వేడి నీరు 500 ఎంఎల్

తయారు చేసే విధానం..

స్టెప్ 1: ఒక గిన్నె తీసుకుని అందులో పుదీనా రెమ్మలు, సగం నారింజ పండు, ముక్కలు చేసిన ఆపిల్ ఒకటి, రెండు అల్లం ముక్కలు, గ్రీన్ టీ బ్యాగ్ లు రెండు , రెండు దాల్చిన చెక్కలు వేసి పక్కన ఉంచండి.

ఇవి కూడా చదవండి

స్టెప్ 2: ఆ తర్వాత మరో పాత్రలో 500 మిల్లీ లీటర్ల నీటిని తీసుకొని స్టవ్ పై పెట్టి బాగా మరిగించాలి. తర్వాత పైన పేర్కొన్న పదార్థాలు దానిలో వేసి మెత్తగా పేస్ట్ గా వచ్చే వరకూ బాగా కలపాలి. దాదాపు ఐదు నిమిషాలు అలా కాగనివ్వాలి. అంతే ఇక హాట్ హాట్ టేస్టీ దాల్చిన చెక్క ఫ్లేవర్ టీ రెడీ.. ఓ గ్లాసులో వడగట్టి.. ఎంచక్కా తాగేయండి..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..