PCOS Tips: హార్మోన్ల సమస్యతో బాధపడుతున్న స్త్రీలకు ‘దాల్చిన చెక్క టీ’ ఎంత ప్రయోజనకరమో తెలుసా..? దీనిని ఎలా చేసుకోవాలంటే..

ప్రస్తుత కాలంలో మానవుడు అవలంభిస్తున్న జీవిన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అండే అది పెద్ద సవాలే..

PCOS Tips: హార్మోన్ల సమస్యతో బాధపడుతున్న స్త్రీలకు ‘దాల్చిన చెక్క టీ’ ఎంత ప్రయోజనకరమో తెలుసా..? దీనిని ఎలా చేసుకోవాలంటే..
Cinnamon
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 15, 2022 | 9:01 AM

ప్రస్తుత కాలంలో మానవుడు అవలంభిస్తున్న జీవిన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అండే అది పెద్ద సవాలే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా స్త్రీలు వారి ఆరోగ్యం కాపాడుకునేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సమస్యలనే ఎదుర్కొంటున్నారని తప్పక చెప్పుకోవాలి. యువతీయువకులలో కౌమార దశకు రాగానే హార్మోన్ల ప్రభావం శరీరంపై ఎక్కువగా ఉంటుంది. హార్మోన్ల ఫలితంగా శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులలో కొన్ని స్త్రీల పాలిట శాపంగా కూడా మారవచ్చు. వీటికి తోడు చెడు ఆహారపు అలవాట్లు, జీవన విధానం ఇతర సమస్యలకు దారితీస్తాయి. అలాంటి సమస్యలలో PCOS ( పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) కూడాఒకటి. అయినా ప్రస్తుత కాలంలో ఇది స్త్రీలలో కనిపించే అతి సాధారణ సమస్యగా మారింది.

హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ సమస్య కలుగుతుంది. ఒక్కసారి ఈ సమస్య ఎదురైతే వెనువెంటనే పరిష్కారం చేసుకోవడం మహిళల ఆరోగ్యానికి మంచిది. లేకపోతే వారు అనేక సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. గర్భం దాల్చలేకపోవడం అనేది మహిళలకు ఈ సమస్య ఇచ్చే శాపాలలో ఒకటి. అయితే దాల్చిన చెక్క వాడకం PCOSలో ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్క మహిళలకు వరం అని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది అవసరమైన పోషకాలను కలిగి ఉండడం వల్ల వివిధ వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది. దాల్చిన చెక్క వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

PCOS అంటే ఏమిటి..?

ఇవి కూడా చదవండి

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే మహిళల శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే దీర్ఘ కాలిక సమస్య. ఇది ఎదురైన తొలినాళ్లలోనే పరిష్కరించుకోవాలి లేకపోతే జీవితాంతం ఈ సమస్యతో బాధపడాల్సిందే. పేలవమైన దినచర్య, ధూమపానం, మద్యపానం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వంటివి కూడా ఈ సమస్యకు గల కారణాలు. ఈ సమస్య మహిళలపై అనేక దుష్ప్రభావాలను చూపిస్తుంది. పీసీఓఎస్ సమస్యతో బాధపడే మహిళలు మొటిమలు, ముఖంలో వెంట్రుకలు పెరగడం, బరువు పెరగడం, జుట్టు రాలడం వంటి అనేక సమస్యలతో బాధపడుతుంటారు. ఇంకా ఈ పీసీఓఎష్ అండాశయాలలో గుడ్డు ఉత్పత్తి ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. పీసీఓఎస్ కారణంగా చాలా మంది స్త్రీల అండాశయంలో గుడ్లు ఉత్పత్తి చేయవు. అయితే పీసీఓఎస్ సమస్యను దాల్చిన చెక్క  పరిష్కరించలేకపోయినా.. ఆ సమస్య నుంచి కొంత మేర ఉపశమనాన్ని కలిగిస్తుంది.

దాల్చిన చెక్క

పీసీఓఎస్‌తో బాధపడుతున్న మహిళలకు దాల్చినచెక్కను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం వారు  ఒక గ్లాసు నీటిలో టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి దానిని బాగా మరిగించాలి. ఆ తర్వాత మరిగిన నీటిని టీ లాగా తాగాలి. రుచి కోసం కావాలంటే.. దాల్చిన చెక్క పొడితో మరిగించిన నీటిలో నిమ్మకాయ తేదా కొంచెం తేనెను కలుపుకొని తాగవచ్చు. ఇలా నిత్యం తాగడం వల్ల పీసీఓఎస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి.