- Telugu News Photo Gallery Cinema photos Actress Krishi Thapanda looks like gold in a golden coloured saree
Krishi Thapanda: బంగారు రంగు చీరలో దగదగా మెరిసిపోతున్న కన్నడ నటి కృషి తపాండా.. వైరల్ అవుతున్న ఫోటోలు..
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కన్నడ నటి కృషి తపాండా తరచుగా తన ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఫొటోలలో బంగారు రంగు చీరలో కృషి దగదగ మెరిపోయారు. దీంతో..
Updated on: Dec 15, 2022 | 8:28 AM

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కన్నడ నటి కృషి తపాండా తరచుగా తన ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఫొటోలలో బంగారు రంగు చీరలో కృషి దగదగ మెరిపోయారు. దీంతో ఆ ఫొటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి.

కుర్రకారును క వ్వించేలా.. సంప్రదాయ బంగారు రంగు చీరలో కాళ్లకు గజ్జెలు కట్టుకుంటూ ఫొటోలకు ఫోజులిచ్చింది కృషి.

మోడల్‌గా సినీ పరిశ్రమకు వచ్చిన కృషి తపాండా.. నే(Nae) అనే తమిళ చిత్రంతో తన ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత వచ్చిన కన్నడ మూవీ ‘అకీరా’ లో నటించిన ఆమె.. సైమా ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డుకు నామినేట్ అయ్యింది.

2016లో తెరకెక్కిన ‘అకీరా’, ‘కహీ’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న కృషి .. తర్వాత‘బిగ్ బాస్ సీజన్ 5(కన్నడ)’లో పాల్గొన్నారు.

కన్నడ నటుడు యోగేష్ నటించిన ‘లంకే’ సినిమాలో కూడా నటించిన కృషి తపాండా.. ప్రస్తుతం పలు సినిమా షూటింగ్స్‌లో బిజీబిజీగా ఉంది.
