AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ వంటింట్లోనే ఉండే ఈ మూడు రకాల పదార్థాలను పిల్లలకు తినిపిస్తే.. మలబద్ధకం నుంచి తక్షణ పరిష్కారం..

ప్రస్తుత జీవిన విధానాల కారణంగా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ జంక్ ఫుడ్‌ను ఇష్టపడుతున్నారు. కానీ జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. విదేశీ ఆయిల్, ప్రిజర్వేటివ్ ఫుడ్ తినడం వల్ల..

Health Tips: మీ వంటింట్లోనే ఉండే ఈ మూడు రకాల పదార్థాలను పిల్లలకు తినిపిస్తే.. మలబద్ధకం నుంచి తక్షణ పరిష్కారం..
Constipation In Children
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 15, 2022 | 8:01 AM

Share

ప్రస్తుత జీవిన విధానాల కారణంగా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ జంక్ ఫుడ్‌ను ఇష్టపడుతున్నారు. కానీ జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. విదేశీ ఆయిల్, ప్రిజర్వేటివ్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి ఫైబర్, న్యూట్రీషియన్స్ వంటి పోషకాలు తగినంతగా శరీరానికి అందవు. ఫలితంగా రోగనిరోధక శక్తి కూడా లోపిస్తుంది. నేటి బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌లో బ్రెడ్‌‌ను ఇస్తుంటారు. దీని వల్ల కడుపులో పలు రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. బ్రెడ్ కొవ్వుతో తయారవుతుంది కాబట్టి దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బలహీనపడుతుంది. బ్రెడ్‌ను పిల్లలు తినడం వల్ల వారి కడుపులో జీర్ణక్రియ సరిగా జరగదు. ఫలితంగా వారి కడుపు శుభ్రం కాకపోగా మలబద్ధకం పెరుగుతుంది.

మలబద్ధకం మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ సమస్య ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లకుండా శరీరంలోనే ఉంటాయి. ఫలితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పరిస్థితులు ఎదురవకుండా జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించి తీరాలి. మలబద్ధకం సమస్యను దూరంగా ఉంచడానికి మీ పిల్లలకు కొన్ని రకాల ఆహార పదార్థాలను ఇస్తే సిరపోతుంది. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

త్రిఫల

త్రిఫల చూర్ణం మనందరికీ సుపరిచితమే. వివిధ రకాల మూలికలను కలిపి త్రిఫల చూర్ణాన్ని తయారు చేస్తారు. ఈ పొడిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఈ పొడిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పొడిని గర్భిణీ స్త్రీలకు కూడా ఇస్తారు.

ఇవి కూడా చదవండి

అత్తి పండు

పిల్లలు అత్తి పండ్లను తినాలని వైద్య నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు. అత్తి పండ్లలో కడుపుకు అవసరమైన ఫైబర్ ఉంటుంది. అత్తి పండ్లను ఖాళీ కడుపుతో లేదా భోజన సమయంలో పిల్లలకు ఇవ్వాలి. అత్తి పండ్లను మరింత పోషకమైనదిగా చేయడానికి వాటిని తినడానికి కొన్ని గంటల ముందు నీటిలో నానబెట్టాలి. శరీరానికి శక్తినిచ్చే శక్తి అంజీర పండ్లకు ఉంది.

పాలు మరియు నెయ్యి

ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకుని అందులో రెండు చెంచాల నెయ్యి కలుపుకుని గోరువెచ్చగా తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇంతకముందు పాలు తాగే పద్ధతి కూడా ఇదే. ఈ రకమైన గోరువెచ్చని పాలు తాగడం వల్ల అన్ని రకాల మలబద్ధకాన్ని తొలగించే సామర్థ్యం పెరుగుతుంది. నెయ్యి విషయానికొస్తే ఇది ఆయుర్వేదంలో ఉత్తమమైన పదార్ధంగా ప్రసిద్ధి. పాలు, నెయ్యిని కలిపి తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి.