Reduce Cholesterol: మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే మసాలాలు గురించి తెలుసా.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

Amarnadh Daneti

Amarnadh Daneti |

Updated on: Nov 18, 2022 | 10:49 PM

మసాలా ఫుడ్ తింటే ఇంట్లో తిడతారు. అలాగే కూరల్లో కూడా ఎక్కువ మసాలాలు వాడకుండా, తగిన మోతాదులో ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని రకాల మసాలాలు మాత్రం ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుస్తాయంటున్నారు నిపుణులు. శరీరంలో చెడు..

Reduce Cholesterol: మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే మసాలాలు గురించి తెలుసా.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Cholesterol

మసాలా ఫుడ్ తింటే ఇంట్లో తిడతారు. అలాగే కూరల్లో కూడా ఎక్కువ మసాలాలు వాడకుండా, తగిన మోతాదులో ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని రకాల మసాలాలు మాత్రం ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుస్తాయంటున్నారు నిపుణులు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే.. గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా చెడు కోలెస్ట్రాల్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. జీవనశైలితో పాటు ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఇదే సందర్భంలో కొన్ని మసాలాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యను కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. కొలెస్ట్రాల్ సమస్య ప్రారంభ దశలో పెద్దగా తెలియదు. అందుకే దానిని లైట్‌గా తీసుకుంటాం. ఈ సమస్య ఏదో ఒక సమయంలో తీవ్రమవుతుంది. ప్రాణాలమీదకు వస్తుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్‌ను ఫస్ట్ నుంచే నియంత్రణలో పెట్టాలంటున్నారు నిపుణులు. ఆహారాన్ని సక్రమంగా తీసుకోకపోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని చెబులున్నారు. దీనిని కంట్రోల్ చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి. వారు ఇచ్చే సూచనలు పాటించాల్సి ఉంటుంది. జీవనశైలితో పాటు ఆహారంలో పలు మార్పులు చేయాలంటున్నారు. వ్యాయామం కచ్చితంగా చేస్తూ ఉండాలి. దీనివల్ల సమస్య అదుపులోకి వస్తుంది. వీటితో పాటు మీ ఆహారంలో కొన్ని మసాలాలను కలిపి తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడే సుగంధ ద్రవ్యాల గురించి తెలుసుకుందాం.

పసుపు

పసుపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా పసుపు దోహదపడుతుంది. కాబట్టి మీరు దీనిని క్రమం తప్పకుండా తీసుకుని.. దాని ప్రయోజనాలను పొందవచ్చు. మరీ ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తుంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క మంచి రక్త ప్రసరణను అందించడంలో సహాయపడుతుంది. ఈ మసాలాను మీ ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి కొంత వరకు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మిరియాలు

మిరియాలులో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అంతే కాకుండా కొవ్వు కణాలను కరిగించడంలో ఇది సహాయం చేస్తుంది. ఫలితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

మెంతులు

మధుమేహాన్ని నియంత్రించడంలో మెంతులు ఎంతో ఉపయోగపడతాయనే విషయం తెలుసు. కాని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా మెంతులు ఉపయోగపడతాయని చాలా మందికి తెలియదు. ఇది చిన్న పేగు, కాలేయంలోని కొలెస్ట్రాల్ శోషణను నిరోధిస్తుంది. ఫలితంగా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu