Skin Care: లైఫ్ స్టైల్ మార్చుకుంటే.. మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చంటున్న నిపుణులు..

శీతాకాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చర్మ ఆరోగ్యం పట్ల ఎంత అశ్రద్ధ చూపిస్తే.. అంత చికాకులు, ఇబ్బందులు వస్తాయంటున్నారు నిపుణులు. చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి.. రోజువారీ చర్మ..

Skin Care: లైఫ్ స్టైల్ మార్చుకుంటే.. మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చంటున్న నిపుణులు..
Skin Care
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 18, 2022 | 10:44 PM

శీతాకాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చర్మ ఆరోగ్యం పట్ల ఎంత అశ్రద్ధ చూపిస్తే.. అంత చికాకులు, ఇబ్బందులు వస్తాయంటున్నారు నిపుణులు. చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి.. రోజువారీ చర్మ సంరక్షణ చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతల ప్రభావంగా చాలా మంది చర్మ సమస్యలు ఎదుర్కొంటారు. సరైన గైడన్స్ లేక.. వారు సమస్యను మరింత పెంచుకుంటారు. అయితే కొన్ని నియమాలు పాటించడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, తాజాగా, సహజంగా మెరుస్తూ కనిపించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు. ఇవన్నీ చేస్తేనే.. చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుందని చెబుతున్నారు. శీతాకాలంలో చర్మ సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.

గోరు వెచ్చటి నీళ్లు

శీతాకాలంలో ఎక్కువమంది బాగా వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన చర్మ సమస్యలను మరింత పెంచుతుంది. చర్మాన్ని కాపాడుకోవాలనుకుంటే వేడినీటి స్నానాన్ని ఆపేయాలి. అయితే వేడి నీటితో కాదని, చల్లని నీటితో స్నానం చేయాలని కాదు. వేడి నీళ్లకు బదులు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. ఇది చర్మాన్ని కాపాడటమే కాకుండా.. సహజ చర్మపు నూనెలను తగిన విధంగా సమతుల్యం చేస్తుంది. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోవద్దు.

మాయిశ్చరైజింగ్ క్లెన్సర్

చర్మానికి ఉపశమనం కలిగించాలంటే.. మాయిశ్చరైజింగ్ క్లెన్సర్ ఉపయోగించాలి. లేకుంటే పొడి చర్మ సమస్యలు వస్తాయి. ఉష్ణోగ్రత తగ్గుదల.. మన చుట్టూ ఉన్న గాలిలో తేమ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల మన చర్మం డ్రై అవుతుంది. అందుకే మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా క్లెన్సర్‌ని ఉపయోగించడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. హానికరమైన ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షించడంలో మాయిశ్చరైజర్లు, క్లెన్సర్లు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా.. డెడ్ స్కిన్ సెల్స్ క్లియర్ చేయడానికి కూడా సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

హైడ్రేట్​గా ఉండాలి

చలికాలంలో చల్లటి గాలులకు గురికావడం వల్ల చర్మం పొడిబారుతుంది. కాబట్టి తప్పకుండా చర్మాన్ని హైడ్రేట్​గా ఉంచుకోవాలి. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. చర్మ సంరక్షణకు హైలురోనిక్ యాసిడ్, రెటినోల్‌ను ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని తాజాగా, మృదువుగా ఉంచడానికి దోహదపడుతుంది.

తీసుకునే ఆహారం..

శీతాకాలంలో​లో దొరికే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. బెర్రీలు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. చల్లని వాతావరణంలో చర్మం ఆరోగ్యంగా ఉండటానికి శీతాకాలంలో దొరికే పండ్లు దోహదపడతాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, ద్రాక్షపండ్లు, చెర్రీస్. ఇలా ఏ పండ్లు అయినా తినవచ్చు. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

వ్యాయామం తప్పనిసరి

శీతాకాలంలో ఉదయాన్నే లేవడానికి చాలామంది బద్ధకిస్తారు. అలాంటిది పొద్దునే లేచి.. వ్యాయామం చేయాలంటే చాలా కష్టం. అయినా సరే మీరు వ్యాయామాన్ని చేస్తూ ఉండాలి. అలా చేస్తే శరీరం వెచ్చగా ఉండేలా సహాయం చేస్తుంది. నిద్రమత్తును పోగొట్టి.. మీలో చురుకుదనాన్ని నింపుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి