AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga: పొట్టిగా ఉన్నారని చింతిస్తున్నారా.. డోంట్ వర్రీ.. ఎత్తును పెంచుకునేందుకు ఈ ఆసనాలు ట్రై చేయండి..

మనుషులు అనేక రకాలు.. పొట్టి వాళ్లు, పొడుగు వాళ్లు, లావు, సన్నం.. ఎలా ఉన్నా.. దానిని చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొంతమంది పొట్టిగా ఉన్నవాళ్లు.. ఎత్తు పెరిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ చికిత్సలను..

Yoga: పొట్టిగా ఉన్నారని చింతిస్తున్నారా.. డోంట్ వర్రీ.. ఎత్తును పెంచుకునేందుకు ఈ ఆసనాలు ట్రై చేయండి..
Paschimottanasana
Amarnadh Daneti
|

Updated on: Nov 18, 2022 | 10:39 PM

Share

మనుషులు అనేక రకాలు.. పొట్టి వాళ్లు, పొడుగు వాళ్లు, లావు, సన్నం.. ఎలా ఉన్నా.. దానిని చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొంతమంది పొట్టిగా ఉన్నవాళ్లు.. ఎత్తు పెరిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ చికిత్సలను ఆశ్రయిస్తూ.. ఎన్నో ఇబ్బందులు పడతారు. ఎత్తు పెరగడం కోసం రకరకాల చికిత్సల జోలికి పోకుండా.. రెగ్యులర్ గా వ్యాయామాన్ని అలవాటు చేసుకుంటే ఫలితం ఉండొచ్చంటున్నారు నిపుణులు. కొంతమందికి ఎత్తు సమస్య పుట్టుకతోనే వస్తుంది. మరికొంతమంది ప్రారంభంలో బాగానే ఉన్నా.. వయసు పెరిగే కొద్ది బరువుకు తగ్గ ఎత్తు ఉండకపోవడంతో ఎత్తు పెరగడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాస్తవానికి యోగాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎత్తు పెరగడానికి కూడా యోగా సహాయపడుతుందంటున్నారు యోగా నిపుణులు. కొన్ని రకాల ఆసనాలు క్రమం తప్పకుండా సాధన చేస్తే ఎత్తులో తేడాలు గమనించవచ్చు అంటున్నారు. ఎత్తు పెరిగేందుకు సహాయపడే ఆసనాల గురించి తెలుసుకుందాం.

తడాసనం

పాదాలపై నిటారుగా నిల్చొని, మీ భుజాలు, మెడను సమానంగా ఉంచి.. నిటారుగా ఉండాలి. గాలి పీల్చుతూ.. రెండు చేతులను గాలిలో పైకి ఎత్తాలి. ఒకదానికొకటి సమాంతరంగా ఉంచాలి. మడమలను నెమ్మదిగా పైకి లేపి.. కాలి వేళ్ల మీద నిలబడాలి. శరీరాన్ని వీలైనంత వరకు పైకి స్ట్రెచ్ చేయాలి. ఈ క్రమంలో కాళ్లు, చేతులను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఈ భంగిమను మీకు ఓపికున్నన్ని సార్లు చేయవచ్చు.

ఉస్ట్రాసనం

కాళ్లను వెనుకకు చాచి నేలపై మోకాళ్లు వేయాలి. అరికాళ్లు.. పైకప్పుకు ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. రెండు చేతులను తుంటిపై ఉంచాలి. లోతైన శ్వాస తీసుకుంటూ.. ఒక వంపు చేయడానికి వెనుకకు వంగాలి. మద్దతు కోసం అరచేతులను పాదాలపై ఉంచాలి. తల వెనుకకు వేలాడదీయాలి. చేతులు, మెడ నిటారుగా ఉండేలా చూసుకోవాలి. సుమారు 10 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి.

ఇవి కూడా చదవండి

పశ్చిమోత్తనాసనం

యోగా మ్యాట్‌పై కూర్చుని.. కాళ్లను వీలైనంత వరకు బయటికి చాచాలి. ఊపిరి పీల్చుకుంటూ.. ముందుకు వంగి, చేతులతో కాలి వేళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఆసనంలో వీపును నిటారుగా ఉంచాలి. మోకాళ్లపై ముఖాన్ని ఉంచడానికి ప్రయత్నించాలి. ఈ భంగిమను చేస్తున్నప్పుడు.. మోకాళ్లను వంచకూడదు. శ్వాస మాములుగానే తీసుకోవాలి.

వృక్షాసనం

నిటారుగా నిల్చొని.. శ్వాస తీసుకుంటూ.. కుడి కాలును ఎడమ మోకాలి వైపునకు మడిచి.. ఎడమ కాలు మీద దానిని ఉంచాలి. కుడి పాదం లోపలి ఎడమ తొడను తాకాలి. బ్యాలెన్సింగ్ కోసం చేతులను పైకి లేపి నమస్కారం చేయాలి. మోచేతులు వంగకుండా చూసుకోవాలి. కొన్ని సెకన్ల పాటు ఈ ఆసనంలో ఉంటే ఫలితం ఉండొచ్చు.

ధనురాసనం

నేలపై బోర్లా పడుకుని.. కాళ్లను ఒకదానికొకటి సమాంతరంగా, దూరంగా ఉంచాలి. మోకాళ్లను వంచి.. పాదాలను గాలిలోకి పైకి లేపాలి. అరచేతులను ఉపయోగించి చీలమండలను పట్టుకోవాలి. గట్టిగా పట్టు వచ్చాకా, కాళ్లు, చేతులను వీలైనంత వరకు సాగదీస్తూ.. పైకి చూడాలి. కొన్ని సెకన్ల పాటు ఈ ఆసనంలో ఉండొచ్చు. శ్వాస మాములుగానే తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.