AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eating Fruits: ఆరోగ్యానికి మంచిదని సమయపాలన లేకుండా పండ్లు తింటున్నారా? ఈ విషయం తెలిస్తే షాకవుతారు

పండ్లల్లో ఉండే పోషకాలు, విటమిన్లు శరీరానికి మంచి చేస్తాయని నమ్మకం. కానీ ఆరోగ్యానికి మేలు చేసే పండ్లే సమయపాలన లేకుండా తీసుకుంటే కీడు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పండ్ల వల్ల మన ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే...

Eating Fruits: ఆరోగ్యానికి మంచిదని సమయపాలన లేకుండా పండ్లు తింటున్నారా? ఈ విషయం తెలిస్తే షాకవుతారు
Fruits
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 16, 2022 | 12:19 PM

Share

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచి ఆహారం. ఫైబర్ అధికంగా ఉండడమే కాక తక్కువ క్యాలరీలు ఉంటాయి. నీటి కంటెంట్ కూడా ఎక్కువగా ఉండడంతో చాలా మంది బరువు తగ్గడానికి కచ్చితంగా పండ్లను ఎక్కువగా తింటుంటారు. అంతేకాకుండా ఎక్కువ మంది పండ్లను స్నాక్ కింద విరివిగా తీసుకుంటుంటారు. అలాగే పండ్లను చిన్నపిల్లలకు కచ్చితంగా పెడతారు. పండ్లల్లో ఉండే పోషకాలు, విటమిన్లు శరీరానికి మంచి చేస్తాయని నమ్మకం. కానీ ఆరోగ్యానికి మేలు చేసే పండ్లే సమయపాలన లేకుండా తీసుకుంటే కీడు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పండ్ల వల్ల మన ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

అన్నంతో పాటు పండ్లు తింటే ప్రమాదకరం

పండ్లు తినేవారిలో చాలా మంది పండ్లను అన్నం తినేటప్పుడు తింటుంటారు. ముఖ్యంగా మనం పెరుగన్నం తినేటప్పుడు కచ్చితంగా మామిడి లేదా అరటిపండును తింటుంటాం. అయితే అది చాలా ప్రమాదరకరమని నిపుణులు చెబుతున్నారు. ఇతర ఆహారంతో పాటు పండ్లు తీసుకున్న సమయంలో ఒకవేళ ఆహారం అరగకపోతే ఫెర్మెంటేషన్ కారణంగా అవి టాక్సిన్స్ గా మారే ప్రమాదం ఉంది. దీంతో మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

పడుకునే ముందు పండ్లు అస్సలే వద్దు

మనం నిద్రకు ఉపక్రమించే సమయంలో ఆకలిగా ఉందనే సాకుతో కచ్చితంగా పండ్లు తినడానికి ఉత్సాహం చూపుతాం. అయితే నిపుణులు మాత్రం అది చాలా చెడ్డ అలవాటని చెబుతున్నారు. పడుకోడానికి ముందు 2-3 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని సూచిస్తున్నారు. నిద్రపోయే ముందు పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని వివరిస్తున్నారు. అలాగే పండ్లల్లో ఉన్న చక్కెర, శరీరంలోకి చక్కెర స్థాయి హెచ్చుతగ్గుల వల్ల ఇబ్బందిని ఎదుర్కొంటామని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మంచినీరు తాగాల్సిందే..

మనలో చాలా మంది చేసే తప్పు పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగము. అయితే నారింజ, పుచ్చకాయ, సీతాఫలం, స్ట్రాబెర్రీ వంటి అధిక నీటి శాతం ఉన్న పండ్లను తిన్నప్పుడు కచ్చితంగా నీటి తాగాలి. ఇలా చేయడం ద్వారా కడుపులో ఆమ్లత్వం తగ్గి ఇతర అనారోగ్యాలకు గురికాకుండా సాయం చేస్తుంది. 

పండ్ల తొక్కలతో మేలు

సాధారణంగా పండ్లను తిన్నప్పుడు తొక్కలను పడేస్తుంటాం. కొంత మంది యాపిల్ ను కూడా పీల్ చేసుకుని తింటారు. అయితే ఇలా చేస్తే పోషకాలను మనం మిస్ అయినట్లే. పండ్ల తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. యాపిల్ తొక్కల్లో అయితే అధిక ఫైబర్ ఉండడమే కాక విటమిన్లు ఏ, సీ అధికంగా ఉంటాయని యాపిల్ తొక్కతోనే తినాలని సూచిస్తున్నారు. 

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం