Valentine Week: వాలెంటైన్ వీక్ గురించి మీకు తెలుసా? వారంలో ప్రతి రోజూ స్పెషలే..

ప్రేమికుల రోజు నుంచి వారం రోజుల ముందు వరకూ ప్రతి రోజు ఓ స్పెషలిటీగా నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఈ వాలెంటైన్ వీక్ ను అనుసరిస్తున్నారు.

Valentine Week: వాలెంటైన్ వీక్ గురించి మీకు తెలుసా? వారంలో ప్రతి రోజూ స్పెషలే..
Valentines Day
Follow us
Srinu

| Edited By: Anil kumar poka

Updated on: Feb 06, 2023 | 5:10 PM

ప్రేమ ఓ వర్ణించలేని ఎమోషన్. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకునే వారిని మనం చూస్తుంటాం. అలాగే తమ ప్రేమను వ్యక్తం చేయాలనుకునే వన్ సైడ్ లవర్స్ కూడా ప్రతి ఒక్కరి బ్యాచ్ లో ఉంటూ ఉంటారు. సంవత్సరంలో చాలా పండుగలు వస్తుంటాయి. అయితే ప్రేమికులకు మాత్రం ఫిబ్రవరి 14 వ తేదీ మాత్రం చాలా స్పెషల్. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వాలెంటైన్ వీక్ చాలా బాగా ప్రాచుర్యం పొందింది. ప్రేమికుల రోజు నుంచి వారం రోజుల ముందు వరకూ ప్రతి రోజు ఓ స్పెషలిటీగా నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఈ వాలెంటైన్ వీక్ ను అనుసరిస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకూ ఈ వాలెంటైన్ వీక్ గా పాటిస్తున్నారు. ప్రతి రోజూ ఓ స్పెషల్ గా గుర్తించి ఆ రోజు వారిని ప్రేమను వ్యక్తపరుస్తూ స్పెషల్ గిఫ్ట్ తనను ప్రేమించే వారికి ప్రజెంట్ చేస్తున్నారు. వాలంటైన్ వీక్ లో పాటించే స్పెషల్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 

రోజ్ డే, ఫిబ్రవరి 7

ఈ రోజు తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రేమికులు గులాబీలను ఇచ్చిపుచ్చుకుంటారు. గులాబీ పువ్వంత స్వచ్ఛమైన ప్రేమను పంచుతామని తమ పార్ట్ నర్స్ కు చెబుతుంటారు. జీవితాంతం కలిసి ఉంటామంటూ గులాబీలు ఇచ్చి తెలుపుతుంటారు.

ప్రపోజ్ డే, ఫిబ్రవరి 8

తమను ప్రేమించిన వారికి జీవితాంతం తోడు ఉంటామని తమ ప్రేమను తెలుపుతూ ప్రపోజ్ చేస్తుంటారు. ఈ రోజు ప్రేమికులకు చాలా స్పెష్ల్ ఎందుకంటే తమ ప్రేమను తమ పార్ట్ నర్ కు తెలిపి సమ్మతి తీసుకుంటుంటారు.

ఇవి కూడా చదవండి

చాక్లెట్ డే , ఫిబ్రవరి 9

ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడే చాక్లెట్స్ ను వారికి ప్రజెంట్ చేస్తూ తమ ప్రేమను వ్యక్తపరిచే స్పెషల్ డే ఇది. ఏ పండుగైన స్వీట్ తో  మొదలు పెట్టాలని అంటుంటారు. కాబట్టి ప్రపోజ్ డే అయిన వెంటనే ప్రేమికులు చాక్లెట్ డేను జరుపుకుంటారు. 

టెడ్డీ డే, ఫిబ్రవరి 10

టెడ్డీ బేర్స్ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వారి ఇష్టానికి తగ్గట్టుగా టెడ్డీ బేర్ ను ప్రజెంట్ చేస్తుంటారు. ఈ బహుమతి మీ భాగస్వామిని నవ్వేలా చేస్తుంది.

ప్రామిస్ డే, ఫిబ్రవరి 11

మీరు జీవితాన్ని పంచుకోవాలనుకునే వారికి నమ్మకాన్ని కలిగిస్తూ ప్రామిస్ చేయడం ఈ రోజు ప్రత్యేకత. జీవితంలో ఎలా ఉండాలనుకోవాలో తమ ప్రేమికులకు చెప్పే మంచి రోజుగా దీన్ని ప్రేమికులు భావిస్తారు. 

హగ్ డే, ఫిబ్రవరి 12

ఈ రోజు ప్రేమను కౌగిలింత ద్వారా వ్యక్తపరుస్తుంటారు. ప్రియమైన వ్యక్తుల కౌగిలింత సమస్యలను మర్చిపోయేలా చేస్తుంది. మీ వారిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారో తెలిపేలా బలంగా కౌగలించుకోవాలి.

కిస్ డే, ఫిబ్రవరి 13

ఈ రోజు తమ ప్రేమను ముద్దు ద్వారా ప్రేమికులు వ్యక్తపరుస్తుంటారు. ఈ రోజు చాలా జంటలు ముద్దు పెట్టుకోవడం ఓ ప్రత్యేకతగా భావిస్తారు. స

వాలెంటైన్స్ డే, ఫిబ్రవరి 14

ఈ రోజును చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు. వారం రోజుల నుంచి స్పెషల్ డేస్ ను జరుపుకున్నా లేకున్నా కచ్చితంగా ఈ రోజు ప్రేమికులు సంబరంగా జరుపుకుంటారు. జీవితంలో వైవాహిక కట్టుబాట్లు తెలిపే విధంగా ఈ రోజు వారు పండుగలా చేసుకుంటారు. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో…!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..