AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: బరువు తగ్గడంలో స్త్రీల కంటే పురుషులే ఫాస్ట్.. ఎందుకో తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి

సాధారణంగా పురుషుల కంటే స్త్రీలల్లో జీవక్రియ తక్కువగా ఉంటుంది. అంటే శ్వాస తీసుకోవడం, ఆలోచించడం, రక్త ప్రసరణ వంటి సాధారణ శరీర విధులకు ఇంధనం ఇవ్వడానికి తక్కువ క్యాలరీలను ఉపయోగిస్తుంది.

Weight Loss: బరువు తగ్గడంలో స్త్రీల కంటే పురుషులే ఫాస్ట్.. ఎందుకో తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి
Work Out
Nikhil
|

Updated on: Feb 04, 2023 | 2:14 PM

Share

స్త్రీలతో పోలిస్తే పురుషులే చాలా స్పీడ్ బరువు తగ్గుతారనే విషయం మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే స్త్రీల శరీర నిర్మాణం దృష్ట్యా బరువు తగ్గడానికి స్త్రీలే ఎక్కువ కష్టపడాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పురుషుల కంటే స్త్రీలల్లో జీవక్రియ తక్కువగా ఉంటుంది. అంటే శ్వాస తీసుకోవడం, ఆలోచించడం, రక్త ప్రసరణ వంటి సాధారణ శరీర విధులకు ఇంధనం ఇవ్వడానికి తక్కువ క్యాలరీలను ఉపయోగిస్తుంది. దీంతో మిగిలిన క్యాలరీలో కొవ్వు రూపంలో శరీరంలో పేరుకుపోతాయి. అలాగే శరీరం కూడా పురుషులతో పోలిస్తే స్త్రీలది భిన్నంగా ఉంటుంది. స్త్రీ శరీర విషయంలో ఎక్కువగా అనవసర కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. దీంతో పురుషులతో పోలిస్తే స్త్రీలు బరువు తగ్గడానికి అధికంగా కష్టపడాల్సి వస్తుంది. శరీర బరువు నిర్వహణ స్త్రీలకు ఎదురయ్యే సమస్యల గురించి ఓ సారి తెలుసుకుందాం.

అధిక కొవ్వు

సహజంగా మహిళలు పురుషులతో పోలిస్తే ఎక్కువ కొవ్వును కలిగి ఉంటారు. పురుషులు ఎక్కువ కండరాల ద్రవ్యరాశితో ఉంటారు. దీంతో అధిక కొవ్వును కరిగించడం వారికి చాలా సులభంగా ఉంటుంది. పురుషుల జీవక్రియ ద్వారా 3-10 శాతం వేగంగా బరువు తగ్గుతారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆహారం తినే విషయంలో పురుషులు స్థిరంగా ఉండగలుగుతారని, కానీ స్త్రీలు మాత్రం ఆహారం విషయంలో రాజీ పడరని అందువల్ల అధికంగా వారి శరీరంలో పేరుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు.

రుతుక్రమ సమస్యలు

రుతుక్రమ సమయంలో స్త్రీలు ఎక్కువగా కండరాలు, ఎముకల్లో ద్రవ్యరాశిని కోల్పోతారు. ఇది వారి శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచుతుంది. తుంటి ఎముక ప్రాంతంలో, అలాగే బొడ్డు వద్ద కొవ్వు అసాధారణంగా పెరుగుతుంది. స్త్రీ శరీరంలో ఉత్పత్తి చేసే టెస్టోస్టెరాన్ హార్మోన్ల వల్ల బరువు సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సరైన వ్యాయామం లేకపోవడం

మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ లీన్ కండరాల ద్రవ్య రాశిని కలిగి ఉంటారు. కాబట్టి వారు తక్కువ శ్రమ చేసినా ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తారు. కానీ మహిళలు మాత్రం ఎక్కువ క్యాలరీలను కరిగించలేరు. కండర ద్రవ్యరాశిని పెంచడానికి మహిళలు సరైన వ్యాయామం ఎంచుకోవాలి.

చక్కెర స్థాయిలు

పురుషులతో పోలిస్తే స్త్రీలు అధికంగా ఆహారం తీసుకునే అవకాశం ఉంది. వారి నెలవారీ సమస్యలు, ఇతర పనులు వారిని ఆహారం వైపు ఆకర్షిస్తాయి. తద్వారా వారి శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. పురుషులు కచ్చితంగా ఆహార ప్రణాళికకు కట్టుబడి ఉండడంతో వారు చాలా త్వరగా బరువు తగ్గుతారు. 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..