Obesity Problem: ఊబకాయం ప్రాణం తీస్తుందని తెలుసా..! భారీకాయంతో ప్రమాదంలో అవయవాలు..
ఊబకాయం ఒక రకమైన వ్యాధి.. అయితే భారతదేశంలోని ప్రజలు దీనిని ఒక సమస్యగా భావిస్తారు. ఊబకాయాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తే, ప్రజలు ఊబకాయం బారిన పడకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు.
భారతదేశంలో ఊబకాయం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా ప్రజలు తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఊబకాయం అనేది చిన్న సమస్య కాదని.. అది ఒక వ్యాధిగా అభివృద్ధి చెందుతోందని చెప్పింది. ఊబకాయం ఒక రకమైన వ్యాధి.. అయితే భారతదేశంలోని ప్రజలు దీనిని ఒక సమస్యగా భావిస్తారు. ఊబకాయాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తే, ప్రజలు ఊబకాయం బారిన పడకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు.
ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ జుగల్ కిషోర్ మాట్లాడుతూ.. భారతదేశంలో BMI 23 కంటే ఎక్కువ ఉంటే.. అప్పుడు అధిక బరువుగా పరిగణిస్తారు. అయితే BMI స్థాయి 30 కంటే ఎక్కువ ఉంటే.. అప్పుడు ఆ పరిస్థితిని ఊబకాయం అంటారు. ఈ స్థూలకాయాన్ని తేలికగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు గురవుతారు. వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తారు.
గుండెపై తీవ్ర ప్రభావం:
స్థూలకాయాన్ని వ్యాధిగా పరిగణించాలని డాక్టర్ జుగల్ అంటున్నారు. దీని ప్రభావం గుండెపై ఉంటుంది. గుండెపై కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అటువంటి పరిస్థితిలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. గుండె ఆరోగ్యం దెబ్బతింటే శ్వాస వ్యవస్థ పాడై.. శ్వాస పీల్చుకోవడంలో అనేక ఇబ్బందులు పడతారు. గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ధమనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి.
మోకాలి నొప్పి
స్థూలకాయం వలన శరీరం బరువు పెరగడంతో కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడతారు. బరువులు ఎత్తి నప్పుడు కీళ్లలో నొప్పి మొదలవుతుందని డాక్టర్ జుగల్ చెప్పారు. శరీరం బరువు మరింత పెరిగితే, అప్పుడు కీళ్ళు పై భారం పడుతోంది. కీళ్లు, పాదాలు ఆరోగ్యం చెడిపోకుండా మొదటి నుంచి బరువు అదుపులో ఉంచుకోవాలి.
కాలేయం, మూత్రపిండాల నష్టం
శరీరంలోని ముఖ్యమైన అవయవాలైన కిడ్నీ, కాలేయంపై కొవ్వు పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని డాక్టర్ జుగల్ చెబుతున్నారు. ఈ కొవ్వు ఒక రకమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ కారణంగా కిడ్నీ, కాలేయం పని తీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ అవయవాలు సరిగా పనిచేయలేవు. కొవ్వు పట్టిన కాలేయానికి తగిన చికిత్స చేయకపోతే.. కాలేయ వైఫల్యం అయి ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది.
మగతనం సమస్య
ఊబకాయం వల్ల స్పెర్మ్ నాణ్యత కూడా తగ్గిపోతుందని మీకు తెలుసా? దీనిని ఒలిగోస్పెర్మియా అంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఊబకాయం ఉన్నవారిలో తక్కువ స్పెర్మ్ ఉత్పత్తి అవుతుంది. పెరిగిన శరీరం.. చక్కెరను అధికంగా ఉత్పత్తి చేస్తూ మధుమేహం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..