Monitor BP: బీపీ రోగులకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్‌తో ఇంట్లోనే బీపీ చెకప్.. సూపర్ టెక్నాలజీ..
బీపీని స్మార్ట్ ఫోన్ సాయంతో మోనిటర్ చేసే క్లిప్ ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో బృందం రూపొందించింది. ఇది స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఓ యాప్ సాయంతో పనిచేస్తుంది. దీనిని అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో రక్తపోటు రోగులు అధికమవుతున్నారు. వారు తరచూ బీపీని చెక్ చేసుకుంటూ మందులు వాడాల్సి ఉంటుంది. అందుకోసం ఆస్పత్రికి వెళ్లి బీపీ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంటి దగ్గర లేదా.. ఏదైనా బయట ప్రాంతాలలో అప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకోవాలంటే కాస్త ఇబ్బందే. అయితే పరిశోధకులు ఓ కొత్త రకం క్లిప్ ని ఆవిష్కరించారు. అతి తక్కువ ధరలో లభ్యమయ్యే ఈ క్లిప్ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ కెమెరా ఫ్లాష్ లైట్ ద్వారా బీపీని మోనిటర్ చేయొచ్చు. వినియోగదారుడి వేలిని కెమెరా ఫ్లాష్ వద్ద ఉంచితే చాలు బీపీని అది చూపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..
ఎవరు తయారు చేశారంటే..
బీపీని స్మార్ట్ ఫోన్ సాయంతో మోనిటర్ చేసే క్లిప్ ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో బృందం రూపొందించింది. ఇది స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఓ యాప్ సాయంతో పనిచేస్తుంది. దీనిని తయారు చేసేందుకు 80 సెంట్స్ ఖర్చు అయ్యింది. అయితే దీనిని 10 సెంట్లకు తీసుకొచ్చేందుకు పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన వివరాలు సైటిఫిక్ రిపోర్ట్స్ లోని జర్నల్ లో పబ్లిష్ అయ్యింది. దీని సాయంతో రెగ్యూలర్ బీపీ మోనిటరింగ్ సులభతరం అవుతుంది. అలాగే తక్కువ ఖర్చుతోనే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు ఎప్పటికప్పుడు బీపీ చెకప్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇవి చాలా తక్కువ ధరకే లభ్యమవుతున్నందన బీపీ చెకప్ కోసం ప్రతిసారి క్లినిక్ వెళ్లాల్సిన అవసరం ఉండదని యూసీ శాన్ డియాగోలోని ఎలక్ట్రిక్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ వ్యాంగ్ అన్నారు.
ఎలా పనిచేస్తుందంటే..
రక్తపోటును కొలవడానికి, వినియోగదారుడు క్లిప్‌పై చూపుడు వేలితో నొక్కితే సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ వినియోగదారుడు ఎంతసేపు నొక్కాలి అనే దానిపై మార్గనిర్దేశం చేస్తుంది. ఇక్కడ ఉండే క్లిప్ అనేది 3డీ-ప్రింటెడ్ ప్లాస్టిక్ అటాచ్మెంట్. ఇది స్మార్ట్‌ఫోన్ కెమెరా మరియు ఫ్లాష్ సైజ్ లో ఉంటుంది. ఇది పిన్‌హోల్ కెమెరా మాదిరిగానే ఆప్టికల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. వినియోగదారు క్లిప్‌పై నొక్కినప్పుడు, స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ వేలిముద్రను వెలిగిస్తుంది. క్లిప్ లోపల ఉన్న స్ప్రింగ్ వినియోగదారుని వివిధ స్థాయిల శక్తితో నొక్కడానికి అనుమతిస్తుంది. వినియోగదారు ఎంత గట్టిగా నొక్కితే అంత సైజ్ లో కెమెరాలో అంత పెద్దగా రెడ్ సర్కిల్ కనిపిస్తుంది. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్ యాప్ ఈ రెడ్ సర్కిల్ నుంచి ప్రధాన సమాచారాన్ని సంగ్రహిస్తుంది. వేలిముద్రలోనికి, వెలుపలికి వెళ్ళే రక్తం పరిమాణాన్ని కొలుస్తుంది. యాప్ లోని ఒక అల్గోరిథం ఈ సమాచారాన్ని సిస్టోలిక్, డయాస్టొలిక్ రీడింగ్లుగా మారుస్తుంది. యూసీ శాన్ డియాగో మెడికల్ సెంటర్ నుంచి 24 మంది వాలంటీర్లపై పరిశోధకులు క్లిప్‌ను పరీక్షించారు. ఫలితాలు రక్తపోటు పరికరం ద్వారా తీసుకున్న దానితో సమానంగానే వచ్చాయి. మరిన్ని పరీక్షలు నిర్వహించి త్వరలోనే దీనిని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..