Simple Belly Fat Tips: నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినండి.. ఈజీగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండి!!

బెల్లీ ఫ్యాట్ దీన్నే బాన పొట్ట అని కూడా అంటూంటారు. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి సరైన ఆహారంతో పాటు వ్యాయామం కూడా కావాలి. అలాగే బెల్లీ ఫ్యాట్ ని తగ్గించేందుకు డ్రై ఫ్రూట్స్ కూడా ఎంతగానో సహాయపడతాయి. ప్రస్తుతం పల్లెటూర్లలో కూడా డ్రై ఫ్రూట్స్ ని ఉపయోగిస్తున్నారు. అంతగా డ్రై ఫ్రూట్స్ వినియోగానికి బాగా డిమాండ్ పెరిగింది. ఈ డ్రై ఫ్రూట్స్ తో ఎన్నో అనారోగ్యాలను దూరంగా ఉంచుకోవచ్చు. అలాగే పలు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తో బెల్లీ..

Simple Belly Fat Tips: నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినండి.. ఈజీగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండి!!
Soaked Fru Fruits
Follow us
Chinni Enni

|

Updated on: Aug 12, 2023 | 1:29 PM

బెల్లీ ఫ్యాట్ దీన్నే బాన పొట్ట అని కూడా అంటూంటారు. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి సరైన ఆహారంతో పాటు వ్యాయామం కూడా కావాలి. అలాగే బెల్లీ ఫ్యాట్ ని తగ్గించేందుకు డ్రై ఫ్రూట్స్ కూడా ఎంతగానో సహాయపడతాయి. ప్రస్తుతం పల్లెటూర్లలో కూడా డ్రై ఫ్రూట్స్ ని ఉపయోగిస్తున్నారు. అంతగా డ్రై ఫ్రూట్స్ వినియోగానికి బాగా డిమాండ్ పెరిగింది. ఈ డ్రై ఫ్రూట్స్ తో ఎన్నో అనారోగ్యాలను దూరంగా ఉంచుకోవచ్చు. అలాగే పలు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ తో బెల్లీ ఫ్యాట్ కి కూడా బైబై చెప్పండి. డ్రై ఫ్రూట్స్ లో అన్నీ అవసరం లేదు.

కేవలం ఈ నాలుగు రకాలు చాలు.. బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి. అయితే ఏదైనా వారం, పది రోజుల్లో రిజల్ట్ రాదు. కొద్ది రోజుల సహయం పడుతుంది. అలాగే అవి తింటున్నాం కదా.. అని మిగతా వాటిపై ఫోకస్ తగ్గించకూడదు. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునే వారు ముఖ్యంగా జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.  ఇక బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి సహాయ పడే ఆ నట్స్ ఏంటో తెలుసుకుందాం.

బాదం:

ఇవి కూడా చదవండి

బాదంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే బాదంతో చాలా రకాల సమస్యలు తగ్గిపోతాయి. జుట్టు, స్కిన్ ప్రాబ్లమ్స్ తో పాటు అధికంగా ఉన్న కొలెస్ట్రాల్, కొవ్వును కూడా బాదంతో నియంత్రించవచ్చు. రోజూ నానబెట్టిన బాదం ను ఉదయాన్నే తింటే హెల్దీగా ఉండొచ్చు. దీనిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు, కాల్షియం, విటమిన్ ఈ, పీచు పదార్థాలు, మాంగనీస్, కాపర్, రైబోప్లోవిన్ ఉంటాయి.

వాల్ నట్స్:

డ్రై ఫ్రైట్స్ లో వాల్ నట్స్ ఒకటి. వాల్ నట్స్ ని ఏ రూపంలో తీసుకున్నా మంచి పోషకాలు అందుతాయి. అందులోనూ నానె బెట్టి తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వాల్ నట్స్ లో ఎక్కువగా మెగ్నీషియం, జింక్, ప్రొటీన్లు, పీచు పదర్థాలు, విటమిన్ బి, సెలీనియం, ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. వాల్ నట్స్ వల్ల గుండె ఆరోగ్యం ఉంటుంది. ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగులోని చెడు బ్యాక్టీరియాను బయటకు పంపించేస్తుంది వాల్ నట్స్. ముఖ్యంగా వాల్ నల్స్ అధిక కొవ్వును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే చర్మం, జుట్టు సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. రోజూ వాల్ నట్స్ తీసుకోవడం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మతి మరుపును తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

అంజీర్ పండ్లు:

నానబెట్టిన అంజీర్ ని ప్రతిరోజూ తినడంలో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. నానబెట్టిన అంజీర్ లో కాల్షియం, ఐరన్, విటమిన్లు, ప్రొటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాడిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టీవ్ గా ఉంచేందుకు ఇవి సహాయపడతాయి. అలాగే బాన పొట్టలో ఉండే కొవ్వును కరిగించేందుకు అంజీర్ బాగా పని చేస్తుంది. బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది. అంజీర్ జీవక్రియను పెంపొందిస్తుంది.

కర్జూరం:

ఖర్జూరంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి బాగా తొడ్పడతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులను దరి చేరనివ్వదు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల.. రోజూ ఉదయం నానబెట్టిన కర్జూరం తినడం వల్ల పొట్ట ఫుల్లుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో అధిక బరువుకు, బెల్లీ ఫ్యాట్ కి చెక్ పెట్టవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో