Peppermint Oil Health Benefits: ఈ పిప్పరమెంట్ ఆయిల్ ను ఒక్కసారి వాసన చూడండి.. ఆ సమస్యలన్నింటికీ బైబై చెప్పండి!!

ఆయుర్వేదంలో అరోమా థెరపీ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అరోమా థెరపీ ద్వారా శరీరరం, మనసును తేలిక పరిచి.. ప్రశాంతంగా ఉంచుతంది. కొన్ని రకాల ఆయుర్వేద అరోమా సుగంధ నూనెలను పీల్చడం ద్వారా పలు రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిలో ఒకటి పిప్పరమెంటు నూనె ఒకటి. పిప్పరమెంటు బిల్లల గురించి విన్నాం.. కానీ ఈ నూనె ఏంటా అని అనుకుంటున్నారు. దీన్నే పుదీనా నూనె అని కూడా అంటారు. దీన్ని ఆకులు, పువ్వుల నుండి సేకరిస్తారు. ఇది సాధారణంగా..

Peppermint Oil Health Benefits: ఈ పిప్పరమెంట్ ఆయిల్ ను ఒక్కసారి వాసన చూడండి.. ఆ సమస్యలన్నింటికీ బైబై చెప్పండి!!
Peppermint Oil Health Benefits
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2023 | 6:37 AM

ఆయుర్వేదంలో అరోమా థెరపీ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అరోమా థెరపీ ద్వారా శరీరరం, మనసును తేలిక పరిచి.. ప్రశాంతంగా ఉంచుతంది. కొన్ని రకాల ఆయుర్వేద అరోమా సుగంధ నూనెలను పీల్చడం ద్వారా పలు రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిలో ఒకటి పిప్పరమెంటు నూనె ఒకటి. పిప్పరమెంటు బిల్లల గురించి విన్నాం.. కానీ ఈ నూనె ఏంటా అని అనుకుంటున్నారు. దీన్నే పుదీనా నూనె అని కూడా అంటారు. దీన్ని ఆకులు, పువ్వుల నుండి సేకరిస్తారు. ఇది సాధారణంగా తలనొప్పి, కండరాల నొప్పి, శ్వాసకోశ, జీర్ణ సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. పిప్పరమెంటు నూనె పీల్చడం లేదా మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ నూనెను ఉపయోగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం

వికారాన్ని తగ్గిస్తుంది:

పిప్పరమెంటు నూనెను వాసన చూడటం ద్వారా వికారం, వాంతులు వంటి లక్షణాలను తగ్గిస్తుంది. అలాగే మార్నింగ్ సిక్ నెస్, మోషన్ ప్రాబ్లమ్స్ కి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

మానసిక సృష్టతను పెంచుతుంది:

ఈ నూనెను వాసన చూడటం ద్వారా మనసు తేలికగా, ప్రశాంతంగా ఉంటుంది. అలసట, చికాకుగా ఉన్నప్పుడు మీ కర్చీఫ్ పై రెండు చుక్కల నూనెను వేసుకుని వాసన చూస్తే ఇట్టే మూడ్ మారుతుంది.

శ్వాసకోస ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

శ్వాసకోస సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారు తరుచుగా ఈ పిప్పరమెంటు ఆయిల్ వాసన పీల్చితే.. ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళలను కూడా తగ్గిస్తుంది.

సైనస్ ని తగ్గిస్తుంది:

చాలా మంది సైనస్ తో బాధపడుతూంటారు. ఇది నిజంగానే వారికి పెద్ద తలనొప్పి. అయితే దానికి పిప్పరమెంటు ఆయిల్ తో చెక్ పెట్టవచ్చు. పిప్పరమెంటు నూనెలో డీకోంగెస్టెంట్ గుణాలను కలిసి ఉంటుంది. వేడి నీటిలో రెండు లేదా మూడు చుక్కల పిప్పరమెంటు ఆయిల్ వేసి తరుచుగా ఆవిరి పడుతూ ఉంటే కొద్దిరోజుల్లో మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మీ కర్చీఫ్ కి కూడా రెండు చుక్కల నూనె వేసి.. అప్పుడప్పుడు వాసన పీల్చితే సైనస్ తగ్గించవచ్చు.

తలనొప్పి మంచి మందు:

ఈ పిప్పరమెంటు నూనెలో కూలింగ్, అనాల్జేసిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది తలనొప్పి, మైగ్రేన్ ల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు.. ఈ నూనెను వాసన చూసి తలపై రెండు చుక్కలు వేస్తే మంచి ఉపశమనం త్వరగా లభిస్తుంది.

జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది:

పిప్పరమెంటు ఆయిల్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు.. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల పిప్పరమెంట్ నూనెను వేసి కలిపి తిగితే రిలీఫ్ వస్తుంది.

కండరాల నొప్పికి బైబై చెప్పవచ్చు:

కండరాల నొప్పితో బాధపడుతుంటే.. మీరు స్నానం చేసేటప్పుడు రెండు, మూడు చుక్కల పిప్పరమెంటు నూనె వేస్తే సరి.. నొప్పులు తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి