Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Walnut Oil Health Benefits: వాల్ నట్ ఆయిల్ తో చర్మం యవ్వనంగానే కాదు.. జుట్టుకు కూడా ఒత్తుగా తయారవుతుంది!!

మనం డైలీ తీసుకునే ఆహారంలో నట్స్ ఒకటి. ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ప్రతీ ఒక్కరి డైట్ లో నట్స్ ఉంటున్నాయి. నట్స్ తో శరీరానికి ఉపయోగ పడే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వీటిల్లో ఒకటి వాల్ నట్స్ ఒకటి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వాల్ నట్స్ ని ఏ రూపంలో తీసుకున్నా పోషకాలు మాత్రం బాగానే అందుతాయి. వీటిల్లో ప్రోటీన్లు, మెగ్నీషియం, జింక్, సెలీనియం, పీచు పదార్థాలు..

Walnut Oil Health Benefits: వాల్ నట్ ఆయిల్ తో చర్మం యవ్వనంగానే కాదు.. జుట్టుకు కూడా ఒత్తుగా తయారవుతుంది!!
Walnut Oil
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2023 | 6:38 AM

మనం డైలీ తీసుకునే ఆహారంలో నట్స్ ఒకటి. ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ప్రతీ ఒక్కరి డైట్ లో నట్స్ ఉంటున్నాయి. నట్స్ తో శరీరానికి ఉపయోగ పడే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వీటిల్లో ఒకటి వాల్ నట్స్ ఒకటి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వాల్ నట్స్ ని ఏ రూపంలో తీసుకున్నా పోషకాలు మాత్రం బాగానే అందుతాయి. వీటిల్లో ప్రోటీన్లు, మెగ్నీషియం, జింక్, సెలీనియం, పీచు పదార్థాలు, విటమిన్ బి, పుష్కలంగా ఉంటాయి. అలాగే ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉండే ఆహార పదార్థాల్లో వాల్‌ నట్స్ ఒకటి. అయితే కేవలం వాల్ నట్స్ కన్నా వాల్ నట్స్ ఆయిల్ లోనే ఇంకా మంచి పోషక విలువలు ఉన్నాయి. మరి ఈ ఆయిల్ వాడకం వల్ల లాభాలు, నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

జుట్టుకు మంచింది: వాల్ నట్స్ ఆయిల్ ను జుట్టుకు రాయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించి.. జుట్టు పోషణను పెంచుతుంది. ఇందులో ఉండే ఓమేగా-3 ప్యాటీ యాసిడ్స్ దీనికి సహాయం చేస్తాయి. జుట్టు డ్రై గా ఉందని బాధపడే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు కూడా పెరుగుతుంది.

క్యాన్సర్ కు చెక్ పెడుతుంది: వాల్ నట్స్ ఆయిల్ తో క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు. రోజూ మీరు తినే ఆహారంలో వాల్ నట్స్ ఆయిల్ ను చేర్చడం ద్వారా.. రొమ్ము క్యాన్సర్, కొలెస్ట్రాల్ క్యాన్సర్ ను తగ్గించడంలో సమాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం: వాల్ నట్ ఆయిల్ తో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనం వాడే వంట నూనెల కన్నా.. వాల్ నట్స్ ఆయిల్లో ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉంది. కాబట్టి ఇది గుండెను ఆరోగ్యకరంగా ఉంచుతుంది.

చర్మ ఆరోగ్యం: వాల్ నట్స్ తో చర్మం కూడా ఫ్రెష్ గా, యవ్వనంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలను తొందరగా రానివ్వదు. ఓ రెండు మూడు చుక్కలు ఈ ఆయిల్ ని తీసుకుని ఫేస్ కి మసాజ్ చేసుకోవచ్చు.

షుగర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది: వాల్ నట్ నూనెను రోజూ ఆహారంలో ఉపయోగిస్తే..షుగర్ వచ్చే ప్రమాదం తగ్గించవచ్చు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి