AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aloe Vera Benefits for Skin: మెరిసే చర్మం కావాలంటే కలబందను ఇలా రాయండి.. అలా యవ్వనంగా మారిపోండి!

అందం అంటే అందరికీ ఇష్టమే. దీని ఆడ, మగ అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ తమకు తాము అందంగా కనిపించాలని తపనపడేవారే. కొందరు బ్యూటీపార్లర్లకు వెళ్తే.. మరి కొందరు మాత్రం ఇంట్లోనే నేచురల్ రెమడీలను ట్రై చేస్తూంటారు. వయసు ఎంత పెరిగినా.. అందం మాత్రం తరగకూడదని అనుకుంటారు. ఇందులో ముఖ్యంగా మగువలు ముందుంటారు. అందం కోసం వారు పడే తపన అంతా ఇంతా కాదు. అందులోనూ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే..

Aloe Vera Benefits for Skin: మెరిసే చర్మం కావాలంటే కలబందను ఇలా రాయండి.. అలా యవ్వనంగా మారిపోండి!
Aloe Vera Benefits
Chinni Enni
|

Updated on: Aug 10, 2023 | 7:54 PM

Share

అందం అంటే అందరికీ ఇష్టమే. దీని ఆడ, మగ అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ తమకు తాము అందంగా కనిపించాలని తపనపడేవారే. కొందరు బ్యూటీపార్లర్లకు వెళ్తే.. మరి కొందరు మాత్రం ఇంట్లోనే నేచురల్ రెమడీలను ట్రై చేస్తూంటారు. వయసు ఎంత పెరిగినా.. అందం మాత్రం తరగకూడదని అనుకుంటారు. ఇందులో ముఖ్యంగా మగువలు ముందుంటారు. అందం కోసం వారు పడే తపన అంతా ఇంతా కాదు. అందులోనూ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే.. వాళ్లే హైలెట్ కావాలనుకుంటారు. అయితే ముఖానికి ఎక్కువగా క్రీమ్ లు, బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడటం వల్ల చర్మం దెబ్బతింటుంది. వాటికి బదులు ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

ముఖం అందంగా, కాంతివంతంగా, ముడతలు, మచ్చలు, మొటిమలు లేకుండా ఉండాలంటే.. అలోవెరా ను వాడటం మంచిది. అయితే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ కాకుండా.. సహజసిద్ధంగా దొరికే అలోవెరాను వాడాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇందులో టైప్ 3 కొల్లాజెన్ ఉంటుంది. ఇది చర్మం బిగుతుగా తయారయ్యేందుకు సహాయపడుతాయి.

ముడతలకు బెస్ట్:

ఇవి కూడా చదవండి

తాజా కలబంద గుజ్జును తీసుకుని చర్మంపై ముడతలు ఉండే చోట రాసి మర్దనా చేసుకోవాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి లేదా కడిగేసుకోవాలి. ముడతలు రాకూడదు అనుకునే చోట కూడా కలబంద గుజ్జును రాయొచ్చు. అలాగే బరువు తగ్గడం వల్ల చర్మం ముడతలు పడినవారు కూడా కలబందను ఇలా రాస్తే చర్మం బిగుతుగా మారి.. ముడతలు పోయి అందంగా కనిపిస్తారు. మొటిమలు ఉన్నవారు కలబంద గుజ్జులో పసుపు కలిపి రాస్తే అవి తగ్గుతాయి. అలాగే ట్యాన్ కూడా పోతుంది.

అరికాలిలో ఆనలు పోతాయి:

అరికాలిలో ఆనలు ఉన్నవారికి కలబంద ది బెస్ట్ మెడిసిన్. తాజా కలబందలో పసుపు కలిపి.. ఒక క్లాత్ లో వేసి ఆనలు ఉన్న చోట రాత్రి పడుకునే ముందు కట్టాలి. ఉదయం లేచాక ఆ కట్టును తీసివేయాలి. ఇలా ప్రతిరోజూ కలబంద, పసుపు కలిపి ఆనలు ఉన్న చోట కడితే.. అవి మెత్తబడి వాటంతట అవే ఊడిపోతాయి. మళ్లీ జీవితంలో రావు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ చిట్కాలను పాటించి మీ ముఖాన్ని, చర్మాన్ని, కాళ్లను అందంగా మార్చుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి