Kitchen Hacks: పసుపు చట్నీతో సీజనల్ వ్యాధులకు చెక్.. ఎలా తయారు చేయాలో చూడండి!!
ఇటీవల ప్రపంచ దేశాలు వచ్చి.. పసుపులో యాంటీ బయోటిక్ గుణాలున్నాయని చెప్తే గానీ చాలామంది నమ్మని పరిస్థితి. కానీ మన పూర్వీకుల కాలం నుంచి ప్రతి వంటలోనూ పసుపుని వాడేవారు. ఆసుపత్రులు రాకముందు వరకూ ఎవరికి దెబ్బతగిలినా పసుపుతోనే మొదటి వైద్యం చేసేవారు. ఇప్పటికే కూరగాయలు కోసేటపుడు వేలు తెగితేనో, ఆడుకుంటూ పిల్లలకు దెబ్బలు తగిలినా రక్తం ఎక్కువ పోకుండా మొదటిగా పసుపే చల్లి కట్టుకడతారు. పసుపులో అంతటి యాంటీ బయోటిక్..
ఇటీవల ప్రపంచ దేశాలు వచ్చి.. పసుపులో యాంటీ బయోటిక్ గుణాలున్నాయని చెప్తే గానీ చాలామంది నమ్మని పరిస్థితి. కానీ మన పూర్వీకుల కాలం నుంచి ప్రతి వంటలోనూ పసుపుని వాడేవారు. ఆసుపత్రులు రాకముందు వరకూ ఎవరికి దెబ్బతగిలినా పసుపుతోనే మొదటి వైద్యం చేసేవారు. ఇప్పటికే కూరగాయలు కోసేటపుడు వేలు తెగితేనో, ఆడుకుంటూ పిల్లలకు దెబ్బలు తగిలినా రక్తం ఎక్కువ పోకుండా మొదటిగా పసుపే చల్లి కట్టుకడతారు. పసుపులో అంతటి యాంటీ బయోటిక్ గుణాలున్నాయి.
సాధారణంగా మనం కూరగాయలతో రోటిపచ్చళ్లను తయారు చేస్తుంటాం. కానీ ఎప్పుడైనా పసుపు చట్నీ ట్రై చేశారా ? అంటే నిజంగా పసుపుతో చేస్తారని కాదు.. పసుపు కొమ్ములతో చేస్తారు. పసుపు ఎక్కువగా పండించే ప్రాంతంలో ఇది బాగా ఫేమస్. మరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి.
పసుపు చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు:
పసుపు కొమ్ములు – పచ్చివి 6, వెల్లుల్లి రెబ్బలు – 5, ఎండుమిర్చి -2, నల్ల జీలకర్ర – అర టీస్పూన్, నూనె -1 టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం:
పసుపు చట్నీ తయారీ చాలా సులభం. పసుపు కొమ్ములు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, నల్లజీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. రోటిలో దంచుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు పాన్ లో నూనె పోసి.. ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి అందులో నీరంతా పోయేంతవరకూ కలపాలి. అది డ్రై గా మారి.. గట్టిగా అవుతుంది. దీనిని వేడిగా ఉండగానే అన్నం లేదా రొట్టెలలో కలిపి తినాలి.
ఈ చట్నీలో వేటినీ వేయించకుండా.. సహజంగా ఉన్నవే వాడుతాం కాబట్టి వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. పసుపు కొమ్ముల్లో ఉండే కర్ క్యుమిన్ అనే పదార్థం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపులో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి కాబట్టి జబులు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి